అప్పట్లో సౌత్ సినిమా ఇండస్ట్రీ లో కుర్రకారు అందరి రాకుమారిగా వెలుగొందిన హీరోయిన్ నగ్మా…( Heroine Nagma ) ఒకానొక టైం లో నగ్మా కాల్ షీట్ల కోసం బడా ప్రొడ్యూసర్లు, దర్శకులు క్యూలు కట్టేవారు.బికినీ అందాలను సౌత్ సినిమాకి పరిచయం చేసింది నగ్మా.
యోగా చేస్తూ అందాలు వడ్డించే స్టైల్ ను పరిచయం చేసింది కూడా నగ్మా అనే చెప్పాలి.నగ్మా హీరోయిన్ అంటే చాలు.
ఆ సినిమాపై ప్రత్యేకమైన క్రేజ్ ఏర్పడేది…
ఇద్దరు హీరోయిన్లు ఉండే కథ అయినప్పటికీ ఈమెనే మెయిన్ హీరోయిన్ గా పెట్టేవారు సీనియర్ దర్శకులు.అలా కొన్నాళ్ల పాటు ఈమె బిజీ స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది.
ఎఫైర్ వార్తలతో కూడా అప్పట్లో ఈమె టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచేది.రవి కిషన్, శరత్ కుమార్ , గంగూలీ ఇలా చాలా మంది స్టార్లతో ఈమె ప్రేమాయణం నడిపినట్టు అప్పట్లో గట్టిగా చర్చ జరిగేది.నగ్మా సినిమాల ద్వారా గట్టిగానే సంపాదించింది…
అప్పట్లో ఉన్న స్టార్ హీరోయిన్లలో ఎక్కువ సంపాదన ఈమెదే అని చాలా మంది చెబుతుంటారు.అలా రెండు రకాలుగా నగ్మా పేరు ప్రఖ్యాతలు పొందింది.అలాంటి ఈమెను ఓ స్టార్ హీరో( Star Hero ) ఘోరంగా అవమానించాడట.అతను టాలీవుడ్లో బడా స్టార్ హీరో.ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలతో అతను టాప్ పొజిషన్ కి చేరుకున్నాడు.డబ్బుని ఎలా పొదుపు చేయాలి.
భవిష్యత్తులో రియల్ ఎస్టేట్( Real Estate ) ఎలా ఉంటుంది అనే విషయాలను తోటి నటీనటులకు వివరంగా చెప్పి వాళ్ళు కూడా నాలుగు రాళ్లు వెనకేసుకునేలా చేశాడు.అయితే అతని సినిమాలో నగ్మా నటిస్తున్న టైంలో…
రోజు ఆమె షూటింగ్ కి ఆలస్యంగా వచ్చిందట.అప్పుడు ఆ స్టార్ హీరో ఆరాతీయగా.ఆమె తిక్క తిక్కగా సమాధానం ఇచ్చిందట.
అలాగే స్థాయి గురించి కూడా నగ్మా మాట్లాడింది.దీంతో ఆ స్టార్ హీరో.‘నీకు ఎంత ఆస్తి ఉంటుంది?’ అని ప్రశ్నించాడట.అందుకు నగ్మా.
తనకి కలిగి ఉన్న ఆస్తి గురించి ఓ నెంబర్ చెప్పగా.! అందుకు ఆ స్టార్ హీరో.
‘నీకున్న ఆస్తి నా బాత్రూం విలువ చేయదు.సభ్యత, సంస్కారం, పనిపై గౌరవం ఉండాలి.
అప్పుడు గౌరవం వెతుక్కుంటూ వస్తుంది’ అంటూ క్లాస్ పీకి అవమానించాడట ఆ స్టార్ హీరో…అయితే ఆయన ఎవరు అనే విషయాన్ని చెప్పకుండానే ఆ స్టార్ హీరో తనని అవమానించారు అని నగ్మా ఒక ఇంటర్ వ్యూ లో తెలియజేసింది…
.