రామ్ చరణ్ అందుబాటులో లేకపోవడం వల్లే ఎన్టీఆర్ కి సైమా అవార్డు వచ్చిందా..?

గత ఏడాది దర్శక ధీరుడు రాజమౌళి( Rajamouli ) తెరకెక్కించిన భారీ మల్టీస్టార్ర్ర్ చిత్రం #RRR ఎంత పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో ప్రతీ ఒక్కరికి తెలిసిందే.ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ కి ఈ సినిమా ద్వారా గ్లోబల్ వైడ్ స్టార్ స్టేటస్ దక్కింది.

 Did Ntr Get The Siima Award Because Of Ram Charan's Unavailability , Siima Awa-TeluguStop.com

అంతే కాకుండా ‘నాటు నాటు’ పాటకి గాను ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది.మన తెలుగు సినిమా గ్లోబల్ రేంజ్ కి రీచ్ అయ్యి ఆస్కార్ అవార్డు గెలుచుకునే రేంజ్ కి వెళ్తుందని ఎవ్వరూ ఊహించలేకపోయారు.

రాజమౌళి గత రెండు చిత్రాలైన బాహుబలి , బాహుబలి 2 కి కూడా ఈ రేంజ్ రెస్పాన్స్ రాలేదు.కేవలం ఆస్కార్ అవార్డు మాత్రమే కాదు, నేషనల్ అవార్డ్స్ లో కూడా ఈ చిత్రం ఆరు క్యాటగిరీస్ లో అవార్డులను గెలుచుకుంది.

ఇప్పుడు సౌత్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే సైమా అవార్డ్స్( SIIMA Awards ) లో కూడా #RRR చిత్రం మెరిసింది.

Telugu Game Changer, Rajamouli, Ram Charan, Siima Award, Tollywood-Movie

ఇక ఈ అవార్డ్స్ లో ఎన్టీఆర్ తో పాటుగా రామ్ చరణ్ కూడా ఉత్తమ నటుడి క్యాటగిరీ లో నామినేట్ అయ్యాడు.కానీ జూనియర్ ఎన్టీఆర్ కి ఈ అవార్డు దక్కింది.దుబాయ్ లో ఘనంగా నిర్వహించిన ఈ సైమా అవార్డ్స్ ఫంక్షన్ కి ఎన్టీఆర్( Jr ntr ) హాజరై ఈ అవార్డు ని అందుకున్నాడు.

అయితే ఈ అవార్డు పై సోషల్ మీడియా లో ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ ఫ్యాన్స్ మధ్య పెద్ద గొడవ మొదలైంది.అసలు విషయం ఏమిటంటే, ఈ చిత్రం లో ఉత్తమ నటుడి క్యాటగిరీ లో రామ్ చరణ్ కి అవార్డు సైమా అవార్డు వచ్చిందని, కానీ ఆయనకీ జ్వరం రావడం వల్ల గత రెండు రోజుల నుండి ఇంటి నుండి బయటకి కదలడం లేదు.‘గేమ్ చేంజర్‘ చిత్రం షూటింగ్ కి కూడా ఆయన బ్రేక్ ఇచ్చి రెస్ట్ తీసుకుంటున్నాడు.

Telugu Game Changer, Rajamouli, Ram Charan, Siima Award, Tollywood-Movie

ఇలాంటి సమయం లో ఆయన దుబాయి కి వచ్చేంత ఓపిక, సమయం లేనందున సైమా యాజమాన్యం కి తెలిపాడని, అందుకే సైమా వారు జూనియర్ ఎన్టీఆర్ కి ఇచ్చారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.ఇండస్ట్రీ లో ఉన్న కొన్ని రిలయబుల్ సోర్స్ కూడా ఇదే విషయాన్నీ చెప్పుకొచ్చింది.ప్రస్తుతం దీని మీదనే సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో రచ్చ జరుగుతుంది.

ఈ సినిమాని చూసిన ప్రతీ ఒక్కరికి రామ్ చరణ్ మెయిన్ హీరో అనే విషయం అర్థం అవుతుందని, ఎన్టీఆర్ కి కొమరం భీముడొ సాంగ్( Game Changer ) తప్ప, అసలు క్యారక్టర్ లేదని, సపోర్టింగ్ రోల్ కి ఉత్తమ నటుడి క్యాటగిరీ లో అవార్డు ఎలా ఇస్తారంటూ రామ్ చరణ్ ఫ్యాన్స్ సైమా అవార్డ్స్ ట్విట్టర్ హ్యాండిల్ ని ట్యాగ్ చేసి ప్రశ్నిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube