తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు.వచ్చే ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలోని పది నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీనే గెలుపు సాధిస్తుందని అన్నారు.
బీఆర్ఎస్ లో పదవులు అనుభవించి జారి పోయిన వాళ్లను చేర్చుకొని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏదో గొప్పగా చెప్పుకుంటున్నారని మంత్రి పువ్వాడ అజయ్ విమర్శించారు.అయితే కేసీఆర్ ఇచ్చిన పదవులను అనుభవించి పార్టీని వీడిపోవడం బాధాకరమని పేర్కొన్నారు.
గత ఎన్నికల్లో తాను ఒక్కడినే గెలిచానని మంత్రి పువ్వాడ అజయ్ ఈ సారి అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పారు.కాంగ్రెస్ ను ప్రజలెవరూ నమ్మే పరిస్థితి లేదని వెల్లడించారు.
ఈ క్రమంలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ అభ్యర్థులే విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు.అయితే జిల్లాకు చెందిన ముఖ్యనేత, మాజీమంత్రి తుమ్మల నాగేశ్వర రావు బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే.