బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర పేరు చెప్పగానే అందరికీ ‘షోలే’ చిత్రం గుర్తొస్తుంటుంది.అందులో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ స్నేహితుడిగా ‘వీర్’గా ధర్మేంద్ర ఆ పాత్రకు ప్రాణం పోశారు.
‘యే దోస్త్ హే.’ అన్న సాంగ్ అప్పట్లో బాగా పాపులర్ అయింది.ఈ పాత్ర ద్వారా ధర్మేంద్రకు కూడా మంచి పేరొచ్చింది.
ధర్మేంద్ర సినిమాల్లో నటిస్తూ సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటున్నారు.తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు.తాను 1960లో కొనుగోలు చేసిన కారు గురించి వివరించారు.
ఆయన గ్యారేజ్‌లో ఉన్న బ్లాక్ ఫియట్‌తో దిగిన ఫొటో షేర్ చేసిన ధర్మేంద్ర.అప్పట్లో ఆ కారు ధర రూ.18 వేలు అని తెలిపారు.అది తన మొదటి కారని, దాని కోసం తాను చాలా స్ట్రగుల్ చేశానని చెప్పారు.
తనకు దేవుడు ఇచ్చిన బేబీ ఫియట్ కారని భావిస్తానని ధర్మేంద్ర వివరించారు.ఇకపోతే ఈ కారు ధర రూ.18 వేలు అయితే, అప్పట్లో రూ.18 వేలు అంటే చాలా పెద్ద విషయమని తెలిపారు ధర్మేంద్ర.ఎప్పటికీ ఆ కారు తనతో ఉండాలని ప్రార్థించాలని కోరారు.ఇక ఆ ఫొటోను చూసి నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని పోస్టులు పెడుతున్నారు.ఓల్డ్ ఫియట్ కారును చాలా భద్రంగా ధర్మేంద్ర దాచుకున్నారని అనుకుంటున్నారు.
ఒకప్పుడు సూపర్ స్టార్‌గా వెలుగొందిన ధర్మేంద్ర ఇప్పుడు పలు చిత్రాల్లో ఆర్టిస్టుగా నటిస్తున్నారు.ధర్మేంద్ర అప్పట్లో చాలా కష్టపడి సినిమాలు చేశారని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
‘షోలే’ చిత్రంలోనే కాదు బయట కూడా బిగ్ బీ అమితాబ్ బచ్చన్‌కు ఆత్మీయ స్నేహితుడిగా ధర్మేంద్ర ఉన్నారని బీ టౌన్ సర్కిల్స్ టాక్.ధర్మేంద్ర ప్రజెంట్ కరణ్ జోహార్ సినిమా ‘ఔర్ రాణీ కీ ప్రేమ్ కహాని’ షూటింగ్‌లో ఫుల్ బిజీగా ఉన్నారు.
తన తనయులు సన్నీ డియోల్, బాబా డియోల్‌తో కలిసి ధర్మేంద్ర నెక్స్ట్ ఇయర్ ‘అప్పే 2’ ఫిల్మ్‌లో నటించనున్నారు.