విశాఖ ఎంపీ కుటుంబం కిడ్నాప్ పై డీజీపీ కట్టుకథ అల్లారని టీడీపీ నేత బుద్దా వెంకన్న అన్నారు.ఎంపీ కుటుంబం కిడ్నాప్ కు గురైతే ఇప్పటివరకు సీఎం స్పందించలేదని తెలిపారు.
కిడ్నాప్ ఘటనపై సీబీఐ విచారణ జరిపితే వాస్తవాలు బయటకు వస్తాయని బుద్దా వెంకన్న వెల్లడించారు.జగన్ నుంచి ప్రాణహాని ఉందని విజయసాయిరెడ్డికి తెలుసన్నారు.
విశాఖ భూ కుంభకోణంలో వాటాలు తేడా వచ్చినందుకే ఎంపీ కుటుంబం కిడ్నాప్ అయిందని ఆరోపించారు.కొడాలి నాని భూ కుంభకోణంపై టీడీపీ వచ్చాక విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
కొడాలి నాని పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని విమర్శించారు.