ఈసారి మరింత రీసౌండ్ వస్తుందంటున్న ప్రస్థానం డైరెక్టర్

టాలీవుడ్‌లో హిట్ మూవీలను తెరకెక్కించి దర్శకుడిగా తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకున్న దేవా కట్ట, ప్రస్థానం చిత్రంతో జాతీయ గుర్తింపును కూడా సొంతం చేసుకున్నాడు.ఈ చిత్రంతో ఒక్కసారిగా దేవా కట్ట పేరు మారుమోగింది.

 Deva Katta, Sai Dharam Tej, Prasthanam-TeluguStop.com

కానీ ఆ తరువాత అంతటి స్థాయిలో సినిమాలు చేయలేకపోయిన ఆయన, ప్రస్తుతం మెగా హీరో సాయి ధరమ్ తేజ్‌తో కలిసి ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు.

అయితే తాజాగా ప్రస్థానం రిలీజ్ అయ్యి పదేళ్లు పూర్తి కావడంతో దేవా కట్ట తన నెక్ట్స్ మూవీ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిపాడు.

సాయి ధరమ్ తేజ్‌తో చేయబోయే సినిమా ప్రస్థానంను మించి ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశాడు.ఇక ఈ సినిమాతో తేజు కెరీర్‌లో మరో బ్లాక్‌బస్టర్ మూవీ నమోదు అవుతుందని దేవా కట్ట అన్నాడు.

ఈ సినిమాను కూడా ప్రస్థానం లాగా పొలిటికల్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కించనున్నట్లు దేవా కట్ట తెలిపాడు.ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను అతి త్వరలో ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube