దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్.ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.
టాలీవుడ్ లో బిగ్గెస్ట్ మల్టీ స్టార్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.ఈ సినిమాను భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాగా రూపొందిస్తున్నారు.
ఈ సినిమా కోసం రాజమౌళి అన్ని ఇండస్ట్రీల నుండి నటీనటులను ఎంపిక చేసుకున్నారు.ఈ సినిమాను డివివి దానయ్య 400 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్ దాదాపు 80 శాతం మేరకు పూర్తి అయ్యింది.ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమరం భీం గా నటిస్తుంటే.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు.

ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన విదేశీ భామ ఒలీవియా మోరిస్ నటిస్తుంటే, రామ్ చరణ్ కు జోడీగా ఇప్పటికే ఆలియా భట్ నటిస్తుంది.అంతేకాదు ఈ సినిమాలో బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు.అయితే ఈ సినిమా ఇంకా విడుదలకు చాలా సమయం ఉన్నా అప్పుడే డిజిటల్ రైట్స్ కోసం భారీ పోటీ మొదలైనట్టు తెలుస్తుంది.
ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.ఆర్ఆర్ఆర్ సినిమా శాటిలైట్ రైట్స్ కోసం బాలీవుడ్ ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ గట్టిగా ప్రయత్నం చేస్తుందని టాక్.
ఆ సంస్థ ఆర్ఆర్ఆర్ రైట్స్ కోసం ఎంత ధర ఇచ్చి అయినా సొంతం చేసుకోవాలని అనుకుంటుందట.ఈ విషయం ఇంకా అధికారికంగా బయటకు రాలేదు.కానీ బాలీవుడ్ లో మాత్రం ఈ విషయం పై పెద్ద ఎత్తున గుసగుసలు వినిపిస్తున్నాయట.అయితే ఈ సినిమాను రాజమౌళి అక్టోబర్ 13 న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు.