బిడెన్ పై అభిశంసనకు డిమాండ్...కమలా హారీస్ పైనే అందరి దృష్టి..!!!

అమెరికా అధ్యక్షుడిగా జో బిడెన్ పూర్తిగా వైఫల్యం చెందారని, అనుకున్న స్థాయిలో ఆయన పాలన లేదని, అగ్ర రాజ్య హోదాని ప్రతీ సారి కిందకు దిగాజార్జారాని ఇక ఆయన అధ్యక్ష కాలం ముగిసే రోజలు వచాయంటూ బిడెన్ పై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.అంతేకాదు ఇక బిడెన్ అధ్యక్ష పీటం నుంచీ దిగిపోవాలని, అధ్యక్షుడిగా పనికిరాడంటూ డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.

 Demand For Impeachment On Biden All Eyes Are On Kamala Harris, Biden, Kamala Har-TeluguStop.com

ఆఫ్ఘాన్ ను నిర్దాక్షిణ్యంగా వదిలేశారని, ఎంతో మంది సైనికుల శ్రమ బూడిద పాలయ్యిందని, అక్కడ ఆఫ్ఘాన్ లో ప్రజలపై ఇప్పుడు జరుగుతున్న దాడులకు బిడెన్ చేతకానితనమే కారణమంటూ విమర్శలు వస్తున్నాయి.

మరీ ముఖ్యంగా అమెరికాలో కరోనా మహమ్మారిని తన్ని తరిమేస్తానని చెప్పిన బిడెన్ డెల్టా మహమ్మారి వ్యాప్తిని కట్టడిచేయడంలో కూడా ఘోరమైన వైఫల్యం చెందారని, అమెరికా వ్యాప్తంగా వ్యాక్సినేషన్ పూర్తి చేయలేకపోయారంటూ బిడెన్ పై విమర్సల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు.

గడిచిన కొన్ని రోజులుగా బిడెన్ ను టార్గెట్ చేసిన మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, బిడెన్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.అసలు అమెరికా అధ్యక్షుడిగా నేను ఉంటే ఈరోజు ఆఫ్ఘాన్ ప్రజలకు అన్యాయం జరిగి ఉండేది కాదని, అమెరికా యావత్ ప్రపంచం ముందు తలదించుకుని ఉండేది కాదని ఈ పరిణామాలకు భాద్యుడిగా బిడెన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

అయితే బిడెన్ రాజీనామా చేయాలని నిన్నా మొన్నటి వరకూ కేవలం ట్రంప్ మాత్రమే డిమాండ్ చేయగా ఇప్పుడు రిపబ్లికన్ పార్టీ నేతలు అందరూ బిడెన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.బిడెన్ పై అభిశంసన పెట్టాలని ఇలాంటి అధ్యక్షుడు అవసరంలేదని మండిపడుతున్నారు.

ఆఫ్ఘాన్ లో బిడెన్ చర్యల కారణంగా మిత్ర దేశాలు అన్నీ అమెరికాను తక్కువగా చూస్తున్నాయని, అగ్ర రాజ్య హోదా కోల్పోయే ప్రమాదం ఉందని అమెరికా మీడియా సైతం బిడెన్ పై కధనాలు కూడా ప్రసారం చేస్తోంది.అంతేకాదు బిడెన్ పాలనపై ప్రజలు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

ఈ క్రమంలోనే బిడెన్ స్థానాన్ని భర్తీ చేయడానికి కమలా హారీస్ సిద్దంగా ఉండాలని కమలా అందుకు అర్హురాలు అంటూ సోషల్ మీడియాలో వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube