ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విపక్ష నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు.ఢిల్లీలో పాలనాధికారంపై కేంద్రం తీసుకువచ్చే ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా ఆయన ప్రతిపక్ష నేతలను కలుస్తున్న సంగతి తెలిసిందే.
ఇందులో భాగంగా తాజాగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అపాయింట్ మెంట్ కోరారు కేజ్రీవాల్.కేంద్రం తెచ్చే ఆర్డినెన్స్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న కేజ్రీవాల్ ఆర్డినెన్స్ చట్టం కాకముందే అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారు.
వివిధ పార్టీల మద్ధతును కేజ్రీవాల్ కూడగడుతున్నారు.ఈ క్రమంలోనే ఇప్పటికే పశ్చిమ బెంగాల్, బీహార్ సీఎంలను ఆయన కలిశారు.