కరోనా వైరస్ ప్రజలను కన్‌ఫ్యూజన్ చేస్తుందంటే.ఈ వైరస్ కోసం తయారు చేసిన వ్యాక్సిన్స్ కూడా ఎన్నో అనుమానాలను కలిగిస్తున్నాయట.
అదీగాక ఈ కోవిడ్ టీకాల పై చేస్తున్న అధ్యాయనాల్లో ఒక్కో విషయం బయట పడుతుండటంతో ప్రజల్లో కూడా క్లారీటి లేక గందరగోళానికి గురవుతున్నారట.

ఇకపోతే తాజాగా ఢిల్లీ ఎయిమ్స్ నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్(ఎన్‌సీడీసీ) వేర్వేరుగా జరిపిన అధ్యయనంలో కరోనా వ్యాక్సిన్ కొవాగ్జిన్, కొవిషీల్డ్ రెండు డోసులు తీసుకున్నప్పటికీ డెల్టా వేరియంట్ సోకే అవకాశం ఉందని తేలిందట.కాగా ఈ అధ్యయనాన్ని ఇంకా ధ్రువీకరించాల్సి ఉందట.అయితే కరోనా టీకాలో కొవాగ్జిన్, కొవిషీల్డ్ తొలి డోసు తీసుకున్న వారిలో 76.9 శాతం డెల్టా వేరియంట్ ఇన్‌ఫెక్షన్‌ను గుర్తించగా, రెండు డోసులు తీసుకున్న వారిలో 60 శాతం ఇన్‌ఫెక్షన్‌ను గుర్తించారట అధ్యయనం చేసి ఎయిమ్స్ అధికారులు.ఇకపోతే బ్రిటన్‌లో వెలుగుచూసిన ఆల్ఫా వేరియంట్‌తో పోలిస్తే భారత్‌లో తొలిసారి గుర్తించిన డెల్టా వైరస్ కు సాంక్రమణ శక్తి 40-50 శాతం అధికమని ఇప్పటికే పలు అధ్యయనాలు వెల్లడించిన విషయం తెలిసిందే.