హాస్టల్ భోజనం అంటే బాలికకు బోర్‌ కొట్టింది.. తండ్రికి ఎంత పెద్ద లిస్ట్ పంపిందో తెలుసా...

హాస్టల్ ఉండే వాళ్లకి తిండి విషయంలో కలిగే ఇబ్బందులు తెలుసు.రుచి లేని వంటకాలను చాన్నాళ్లుగా తింటుంటారు.

 Daughter Huge Meal Menu To Father After Returning Five Months From Hostel Detail-TeluguStop.com

అయితే ఇంటికి వచ్చినప్పుడు మాత్రం కనీసం చికెన్ వండినా ఎంతో ఆత్రుతతో తింటుంటారు.ముఖ్యంగా కారంతో వండే నాన్ వెజ్ వంటకాలను లొట్టలేసుకుని తింటుంటారు.

ఇదే కోవకు సంబంధించిన ఓ న్యూస్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.హాస్టల్ నుంచి వచ్చిన ఓ కుమార్తె తన తండ్రికి తనకు ఏం కావాలో లిస్ట్ పంపింది.

ఆ లిస్ట్ చూడగానే అందరూ ఆశ్చర్యపోతున్నారు.దానిని సోషల్ మీడియాలో పెట్టగానే నెటిజన్లు అవాక్కవుతున్నారు.

దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.

హాస్టల్ నుండి ఇంటికి తిరిగి వస్తున్న ఒక అమ్మాయి తను వచ్చిన రోజు తినాలనుకున్న వస్తువుల జాబితాను తన తండ్రికి పంపింది.

ట్విట్టర్ యూజర్ శ్వేతాంక్ తన కుమార్తె శిక్షతో జరిపిన సంభాషణ స్క్రీన్‌షాట్‌ను ట్విట్టర్‌లో పంచుకున్నారు.హాస్టల్‌లో ఉన్న ఐదు నెలల తర్వాత ఇంటికి తిరిగి వస్తున్న తన కుమార్తె శిక్షతో శ్వేతాంక్ తన సంభాషణకు సంబందించిన స్క్రీన్‌షాట్‌ అది.తను వచ్చే రోజు అంటే డిసెంబర్ 16న తినాలనుకునే వంటల పెద్ద జాబితాను అతనికి పంపింది.

మటన్ బిర్యానీ నుంచి ఫిష్ టిక్కా వరకు అన్నీ తనకు కావాలి.శిక్షా తను వచ్చిన రోజున తను ఏమి తినాలనుకుంటుందో మొత్తం మెనూని తండ్రికి పంపుతుంది.స్టార్టర్స్ నుండి డెజర్ట్ వరకు, ఈ మెనూలో అన్నీ ఉన్నాయి.

దీనికి నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు.తన కుమార్తెకు పెళ్లై, పిల్లలున్నా ఇప్పటికీ తనకు ఇలాంటి పెద్ద పెద్ద జాబితాలు పంపుతుందని ఓ వ్యక్తి కామెంట్ చేశారు.

అదనంగా తన భర్త, పిల్లల కోరికలను కూడా జాబితా రూపంలో పంపుతుందని వాపోయాడు.ఓ యువకుడు మరోలా కామెంట్ చేశాడు.

తాను కనుక ఇలాంటి లిస్ట్ పంపితే తన అమ్మ తనపైకి చెప్పు విసురుతుందని వ్యాఖ్యానించాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube