తెలంగాణ బీజేపీకి షాక్ తగిలింది.దాసోజు శ్రవణ్ ఆ పార్టీకి రాజీనామా చేశారు.
ఈ క్రమంలో రాజీనామా లీఖను బండి సంజయ్ కు పంపించారు.సాయంత్రం టీఆర్ఎస్ లో ఆయన చేరనున్నారని సమాచారం.
మంత్రి కేటీఆర్ సమక్షంలో దాసోజు శ్రవణ్ గులాబీ కండువా కప్పుకోనున్నారు.ఇటీవల కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వెళ్లిన విషయం తెలిసిందే.
మునుగోడులో బీజేపీ తీరు జుగుప్సాకరంగా ఉందని దాసోజు శ్రవణ్ వ్యాఖ్యానించారు.దశ దిశా లేని రాజకీయ పరిణామాలు కొనసాగుతున్నాయని అన్నారు.
తనలాంటి బలహీన వర్గానికి చెందిన నాయకులకు బీజేపీలో సరైన స్థానం లేదని స్పష్టమైందని ఆరోపించారు.మునుగోడులో మద్యం, డబ్బుతో గెలవాలన్న బీజేపీ తీరుకు నిరసనగా రాజీనామా చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.