బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఇటీవల మరింత పాపులర్ అయిన విషయం తెలిసిందే.సినీ అభిమానుల నుంచి రాజకీయ నేతల వరకు ప్రతి ఒక్కరూ కంగనా గురించే చర్చించుకుంటున్నారు.
సుశాంత్ సింగ్ రాజ్ ఫుత్ ఆత్మహత్య ఘటన తరువాత కంగనా రోజుకొక వివాదం లో చిక్కుకుంటుంది.ఆమె పై సేన నేతలు కూడా గుర్రు మంటున్నారు.
అయినప్పటికీ ఎప్పటికప్పుడు సవాళ్లు విసురుతూ రెచ్చిపోతుంది.ఇటీవల సుశాంత్ కేసు విచారణలో డ్రగ్స్ అంశం తెరపైకి రావడం తో తన శైలి లో రెచ్చిపోయిన ఈ ముద్దుగుమ్మ ప్రముఖ హీరోలకు డ్రగ్స్ టెస్ట్ చేయాలి అంటూ బహిరంగంగానే వ్యాఖ్యలు చేసింది.
అయితే కంగనా తీరు పై సీనియర్ యాక్టర్ దలీప్ తాహిల్ మండిపడ్డారు.
ఇతరులు డ్రగ్ టెస్టు చేయించుకోవాలని చెప్పే ముందు కంగనా ఆ టెస్టు చేయించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
తోటి ఆర్టిస్టులపై ఇలా వ్యక్తిగత వ్యాఖ్యలు చేసేటప్పుడు ముందుగా ఆమె టెస్టు చేయించుకోవాలి అని దలీప్ అన్నారు.ఏ రంగంలోనైనా డ్రగ్స్ వాడకం ప్రమాదమేనని, కేవలం బాలీవుడ్‌నే తప్పుబట్టడం సరికాదంటూ ఆయన మండిపడ్డారు.
సుశాంత్ కేసు విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం సరిగా వ్యవహరించట్లేదని, ప్రభుత్వం కొందరిని సేవ్ చేయడానికి ప్రయత్నిస్తోందని ఆరోపణలు చేస్తోంది.ఈ నేపథ్యంలో ఇటీవల కంగనా రనౌత్ పాక్ ఆక్రమిత కశ్మీర్‌తో ముంబైని పోలుస్తూ చేసిన వ్యాఖ్యలపై అధికార శివసేన నేతలు మండి పడుతున్నారు.
దీనితో ఆమె ముంబై లో అడుగుపెడితే రాడ్ల తో కర్రలతో కొడతాం అంటూ సేన నేతలు వ్యాఖ్యల చేయగా,సెప్టెంబర్ 9 న ముంబై లో అడుగుపెడుతున్న ఎవరు ఆపుతారో ఆపండి అంటూ సవాల్ కూడా చేసింది.ఈ నేపథ్యంలో ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ లో ఉన్న కంగనా… ఈనెల 9న ముంబైకి రానుండడం తో ఆమెకు వై కేటగిరీ భద్రతను కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది కూడా.