కాంగ్రెస్ యాక్షన్.. బీజేపీ రియాక్షన్ !

గత కొన్ని రోజులుగా కర్నాటక రాజకీయాలు ఫుల్ హీట్ మీద ఉన్నాయి.ఎందుకంటే మే లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించి అధికారంలోకి వచ్చింది.

 Congress Action.. Bjp Reaction , Congress Party , Bjp Party ,brs Party , Pol-TeluguStop.com

అయితే అధికారంలో ఉన్న కాంగ్రెస్ ను కూల్చేందుకు బీజేపీ ప్లాన్ చేస్తోందని స్వయంగా హస్తం నేతలే ప్రకటించడంతో రాజకీయం వేడెక్కింది.దాంతో ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలను కాపాడుకుంటూనే బీజేపీపై రివర్స్ ఎటాక్ చేసేందుకు హస్తం నేతలు ప్లాన్స్ సిద్దం చేసుకున్నారు.

కమలం పార్టీకి చెందిన 20 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకునే ప్లాన్ చేస్తున్నారట హస్తం నేతలు.

Telugu Bjp, Brs, Congress, Narendra Modi, Raju Kage-Politics

కాంగ్రెస్( Congress ) లో చేరితే ఆశించిన పదవులు ఇస్తామని ఆశచూపుతున్నారట.దీంతో కొంతమంది బీజేపీ ఎమ్మేల్యేలు ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనేతలతో టచ్ లోకి వెళ్ళినట్లు సమాచారం.తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజుకగే ( Raju Kage )మాట్లాడుతూ.20 మంది బీజేపీ ఎమ్మేల్యేలు తమతో టచ్ లో ఉన్నారని వారితోనే లోక్ సభ ఎన్నికలకు వెళతామని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.దీంతో అలెర్ట్ అయిన బీజేపీ వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు చెక్ పెట్టాలని చూస్తోంది.

అందులో భాగంగానే ఎవరు ఊహించని విధంగా జెడిఎస్ పార్టీతో పొత్తుకు రెడీ అయింది కమలం పార్టీ.

Telugu Bjp, Brs, Congress, Narendra Modi, Raju Kage-Politics

ఇప్పటికే తుది చర్చలు కూడా పూర్తయినట్లు సమాచారం.ఇక సీట్ల విషయంలో ప్రధాని మోడితో( Narendra Modi ) చర్చించిన తరువాత తుది నిర్ణయాన్ని ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.25 లోక్ సభ స్థానాలు ఉన్న కర్నాటకలో ఈసారి నాలుగు సీట్లను జెడిఎస్ కు కేటాయించే అవకాశం ఉందట.గత ఎన్నికల్లో 23 ఎంపీ సీట్లను బీజేపీ గెలుచుకుంది.ఈసారి జెడిఎస్ సాయంతో అన్నీ స్థానాలను కూడా క్లీన్ స్వీప్ చేసి కాంగ్రెస్ ను కోలుకోలేని దెబ్బ తీయాలని కమలనాథులు ప్రయత్నిస్తున్నారట.

దీంతో ఒకరిపై ఒకరు పై చేయి సాధించేందుకు అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ పోటాపోటిగా వ్యూహాలు రచిస్తున్నాయి.తాజా పరిణామాలు చూస్తుంటే ఎన్నికల సమయానికి ఈ రెండు పార్టీల మద్య పోలిటికల్ వార్ తారస్థాయికి చేరుకునేలా కనిపిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube