హైదరాబాద్ గాంధీభవన్ లో నిర్వహిస్తున్న ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి గందరగోళం నెలకొంది.ఓటర్ లిస్టులో తేడాలపై తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పాతవారి పేర్లు తొలగించి కొత్తవారికి ఓట్లు ఇవ్వడంపై మండిపడ్డారు.ఈ క్రమంలోనే ఖమ్మం జిల్లాలో 32 ఓట్లు కొత్త వారికి ఇచ్చారని రేణుక చౌదరి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
అటు నారాయణఖేడ్ లో సంజీవరెడ్డి ఓటు తొలగింపుపై దామోదర సీరియస్ అయ్యారు.దీనిపై ఏఐసీసీ ఎన్నికల అథారిటీకి ఫిర్యాదు చేస్తానని రేణుకా చౌదరి తెలిపినట్లు తెలుస్తోంది.
దీంతో ఎన్నికల్లో టెన్షన్ వాతావరణం ఏర్పడింది.అయితే కాంగ్రెస్ అధ్యక్ష బరిలో సీనియర్ నేతలు శశి థరూర్, మల్లికార్జున ఖర్గే ఉన్న సంగతి తెలిసిందే.