తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీఆర్ఎస్ రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేసింది.
హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా నిన్న రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ ప్రగతిభవన్ ను కూల్చాలని వ్యాఖ్యనించిన సంగతి తెలిసిందే.చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేపడుతున్న రేవంత్ పై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేతలు డీజీపీని కోరారు.