టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ కమెడియన్ల జాబితాను పరిశీలిస్తే అందులో సుధాకర్ ముందువరసలో ఉంటారు.తన కామెడీతో ఎన్నో విజయాలను సొంతం చేసుకున్న సుధాకర్ తెలుగులో సంక్రాంతి సినిమా తరువాత కొన్ని రోజుల పాటు కోమాలో ఉండటంతో సినిమాలకు దూరమైన సంగతి తెలిసిందే.
గతంలో సుధాకర్ ఆరోగ్యానికి సంబంధించి కొన్ని గాసిప్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే.
తాజాగా ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన సుధాకర్ ఆ ఇంటర్వూలో ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
గతంలో ప్రముఖ హీరోయిన్ రాధికకు, సుధాకర్ కు మధ్య ఏదో ఉందని గట్టిగా ప్రచారం జరిగింది.సుధాకర్, రాధిక కలిసి ఎక్కువ సినిమాలలో నటించడం వల్ల ఈ తరహా ప్రచారం ఎక్కువగా జరిగింది.
సుధాకర్ తన పెళ్లి, ఇతర విషయాల గురించి మాట్లాడుతూ 1983 జనవరి 9వ తేదీన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని స్థాపించిన రోజునే తన వివాహం జరిగిందని అన్నారు.
విజయవాడలోని కనకదుర్గ దేవాలయంలో వివాహం జరిగిందని సుధాకర్ అన్నారు.
తనది అరేంజ్డ్ మ్యారేజ్ అని తొలి పెళ్లిచూపుల్లోనే మ్యారేజ్ ఫిక్స్ అయిందని సుధాకర్ తెలిపారు.ప్రముఖ నటి రాధికతో తిరుగుతున్నానని తనపై ఇండస్ట్రీలో భయంకరమైన రూమర్స్ వచ్చాయని.
ఆ రూమర్స్ ను తాను అస్సలు పట్టించుకునే వాడిని కాదని సుధాకర్ అన్నారు.సినిమా ఇండస్ట్రీలో తనకు ఎవరూ ఎక్కువగా టచ్ లో లేరని సుధాకర్ పేర్కొన్నారు.

ఆస్తుల గురించి స్పందిస్తూ ఆర్థికపరమైన సమస్యలు అయితే ఏమీ లేవని సుధాకర్ వెల్లడించారు.తనకు ఎటువంటి బ్యాడ్ హాబిట్స్ లేవని ఆహారం విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకునేవాడినని కానీ ఊహించని విధంగా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని సుధాకర్ పేర్కొన్నారు.ప్రస్తుతం తనకు ఆరోగ్య సమస్యలేం లేవని అయితే వేగంగా నడవలేనని సుధాకర్ అన్నారు.