అందమైన అబ్బాయిలు చూస్తే ఆ అమ్మాయి కళ్ళు తిరిగి పడిపోతుంది

ప్రపంచంలో చాలా అరుదైన వ్యాధులు ఉన్నాయి.అయితే ఆ వ్యాధుల గురించి ఎక్కడో చదువుకున్నంత వరకు లేదంటే ఏదో సినిమాలో చూసినంత వరకు అవి ఉన్నాయనే విషయం కూడా మనకి తెలియదు.

 Woman With Rare Brain Condition Collapses Any Time She Sees Someone 'attractive'-TeluguStop.com

కొంత మంది అప్పటికప్పుడే ముందు జరిగిన విషయాలని మరిచిపోతూ ఉంటారు.మరల ఎవరో గుర్తుచేసే వరకు అవి గుర్తురావు.

కొంత మంది చేసిన పనే మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటారు.మరికొంత మంది అతిగా నిద్రపోతూ ఉంటారు.

అలాగే కొంత మంది సూర్యోదయాన్ని చూడలేరు.మరికొంత మంది తమచుట్టూ లేని వారు ఉన్నట్లుగా తమతో మాట్లాడుతున్నట్లుగా ఊహించుకుంటూ ఉంటారు.

అలాగే కొంత మంది భయం వేసిన, ఆశ్చర్యానికి గురైన, లేదంటే ఎలాంటి ఎమోషన్ కలిగిన వెంటనే కళ్ళుతిరిగి పడిపోతారు.ఇలాంటి అరుదైన మానసిక వ్యాధులు ప్రపంచంలో అరుదుగా కోట్ల మందిలో ఒకరికి అన్నట్లు కనిపిస్తూ ఉంటాయి.

ఇలాంటి ఒక వ్యాధి ఉందనే విషయం డాక్టర్లు గుర్తించి బయట ప్రపంచానికి పరిచయం చేసే వరకు తెలియదు.

తమిళ్ లో విశాల్ హీరోగా ఒక సినిమా వచ్చింది.

ఆ సినిమాలో ఏ విషయంలో అయినా షాకింగ్ కి గురైతే అతను వెంటనే కళ్ళు తిరిగి పడిపోతాడు.అలాంటి అరుదైన వ్యాధి ఓ అమ్మాయికి ఉంది.ఈ అమ్మాయి అందమైన అబ్బాయిలని, ఆకర్షణీయమైన వస్తువులని చూసిన వెంటనే మూర్చలాగా వచ్చేసి కళ్ళుతిరిగి పడిపోతుంది.ఈ వ్యాధిని క్యాటాప్లెక్సీ అంటారు.

దీని వ‌ల్ల ఆమెకు ఆక‌ర్షిణీయంగా ఎవ‌రు క‌నిపించినా వెంట‌నే కింద‌ప‌డిపోయి, నిద్ర‌లోకి జారుకుంటుంది.అందుకే ఈమె ఇంటి నుంచి బ‌య‌ట‌కొస్తే దించిన త‌ల ఎత్త‌కుండా వెళ్లిపోతుంది.

‌యునైటెడ్ కింగ్‌డ‌మ్‌లోని చెషైర్‌కు చెందిన క్రిస్టి బ్రౌన్ అనే 32 ఏళ్ల యువ‌తి రోజులో క‌నీసం ఇలా 5 సార్లు క్యాటాప్లెక్సిక్ కారణంగా కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటుంది.ఎలాంటి బ‌ల‌మైన ఎమోష‌న్ కు గురైనా అనుకోకుండా ఆమె కండ‌రాలు ప‌ట్టుత‌ప్పి, ప‌క్ష‌వాతం ఏర్ప‌డుతుంది.

దాని వ‌ల్ల‌ ఆమె అక్క‌డిక‌క్కడే కూల‌బ‌డుతుంది.ఈ కారణంగా ఆమె బయటకి వెళ్ళిన తల క్రిందికి దించుకొని నడుస్తూ ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube