మనలో చాలామందికి పాము పేరు వినిపిస్తేనే వెన్నులో వణుకు పుడుతుంది.అలాంటిది పాము మన ఇంట్లోకి వస్తే ఒళ్లంతా చెమటలు పట్టేస్తాయి.
పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ప్రతి ఒక్కరూ పాము అంటే భయపడతారు.అయితే ఒడిశాలోని ఒక వ్యక్తి ఇంటికి వచ్చిన పాము మంచమెక్కి దుప్పట్లో దూరింది.
ఆ దూరిన పాము నాగుపాము కావడంతో ఆ ఇంటి యజమాని గుండె గుభేలుమంది.ఒడిశాలోని కటక్ జిల్లా బంకీ హరీరాజ్ పురా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
పాము ఇంట్లోకి వచ్చిన సమయంలో ఇంటి యజమాని సహా ఎవరూ ఇంట్లో లేరు.కొంత సమయం తర్వాత బెడ్ లోని దుప్పటిలో పాము దూరింది.బయటకు వెళ్లిన ఇంటి యజమాని ఇంట్లోకి రాగా ఇంట్లో అతనికి వింత శబ్దాలు వినిపించాయి.బుస్ బుస్ మని వస్తున్న ఆ శబ్దాలు పామువేనని గ్రహించిన ఇంటి యజమాని దాని కోసం ఇళ్లంతా వెతికాడు.
పాము ఎక్కడా కనిపించకపోవడంతో బెడ్ పై వెతకగా బుసలు కొడుతున్న నాగుపాము అతనికి కనిపించింది.
ఏం చేయాలో పాలుపోని సదరు ఇంటి యజమాని భయంభయంగానే స్నేక్ హెల్ప్ లైన్ వాలంటీర్లకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు.
సంఘటనా స్థలానికి చేరుకున్న వాలంటీర్లు చాకచక్యంగా పామును పట్టుకున్నారు.విషపూరితమైన ఆ పాము దాదాపు 5 అడుగుల పొడవుతో ఉంది.ఈ పాము కాటేస్తే మనిషికి అపాయం అని వాలంటీర్లు మీడియాకు తెలిపారు.ప్రస్తుతం సోషల్ మీడియాలో పాముకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి.