టిఆర్ఎస్ అధినేత , తెలంగాణ సీఎం కేసీఆర్ తో వ్యవహారం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు.ఎవరికి ఎప్పుడు ప్రాధాన్యం ఇస్తారో, ఎవరిని అమాంతం కిందకు లాగేస్తారో అసలు ఊహించలేదు.
ఇప్పటికే టీఆర్ఎస్ లో కీలకంగా వ్యవహరించిన ఎంతోమంది విషయంలో ఈ విషయం స్పష్టం అయ్యింది.గతంలో టిఆర్ఎస్ ఎంపీగా ఉన్న విజయశాంతికి కెసిఆర్ అత్యధిక ప్రాధాన్యం ఇచ్చేవారు.
ఇక ఆ తరువాత ఆమెకు ప్రాధాన్యం పూర్తిగా తగ్గించడం, కనీసం అపాయింట్మెంట్ ఖరారు చేయకపోవడం వంటి కారణాలతో ఆమె టిఆర్ఎస్ కు దూరమై ప్రస్తుతం బిజెపిలో చేరారు.ఇది ఎలా ఉంటే టిఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత నుంచి కీలకంగా వ్యవహరిస్తూ కెసిఆర్ తర్వాత ఆ స్థాయిలో గుర్తింపు పొందిన ఈటెల రాజేందర్ విషయంలోనూ ఇదే జరిగింది .రెండోసారి టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈటెల రాజేందర్ కు చాలా కాలం మంత్రి పదవి ఇవ్వలేదు.
ఇక ఆ తర్వాత వైద్య ఆరోగ్యశాఖ మంత్రి గా అవకాశం ఇచ్చారు.
కానీ ఆయన కేటీఆర్ విషయంలో అసంతృప్తిగా ఉన్నారని కొంతమంది దగ్గర అనేక వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని , ఇలా రకరకాల కారణాలతో రాజేందర్ ను పూర్తిగా దూరం పెట్టడంతో పాటు, మంత్రి పదవి నుంచి తప్పించారు.అంతేకాదు టిఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయడం తదితర పరిణామాలు అనంతరం ఆయన బిజెపిలో చేరారు.
హుజురాబాద్ నుంచి ఎమ్మెల్యే గా పోటీ చేసి మరీ గెలుపొందారు.ఇక పూర్తి స్థాయిలో టార్గెట్ అయ్యారు.
అసలు అసెంబ్లీ లోనూ , బయటా రాజేందర్ ను చూసేందుకు కూడా కేసీఆర్ ఇష్టపడడం లేదు.ఈ నేపథ్యంలో త్వరలో జరగనున్న అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఈటెల రాజేందర్ అసెంబ్లీలో అడుగుపెట్టకుండా టిఆర్ఎస్ వ్యవహరం చేసినట్టుగా కనిపిస్తుంది.
ఈ మేరకు ఈటెల రాజేందర్ అసెంబ్లీ స్పీకర్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను హైలెట్ చేసి ఆయనను సస్పెండ్ చేసేందుకు టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తోంది.కెసిఆర్ చెప్పినట్లుగా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ వ్యవహరిస్తున్నారంటూ ఈటెల రాజేందర్ చేసిన విమర్శలు సాదాసీదా విమర్శలు అయినా, దీనిపై సభ వ్యవహారాల మంత్రి ప్రశాంత్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి మరి ఈటెల రాజేందర్ పై విమర్శలు చేశారు.

రాజేందర్ స్పీకర్ ను కించపరిచారని, ఇది ఖండనీయం అని, ఆయన క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. లేకపోతే చర్యలు తీసుకుంటామని అన్ని వ్యవస్థలను దిగజారుస్తున్న బిజెపికి స్పీకర్ ను అవమానపరచడం పెద్దగా ఆశ్చర్యం అనిపించడం లేదంటూ ప్రశాంత్ రెడ్డి విమర్శలు చేశారు.స్పీకర్ పై రాజేందర్ చేసిన వ్యాఖ్యలను సీరియస్ గా పరిగణిస్తున్నామని, స్పీకర్ కు రాజేందర్ క్షమాపణలు చెప్పకపోతే, స్పీకర్ స్థానం గౌరవాన్ని కాపాడేందుకు సభ నిబంధనలు ప్రకారం ముందుకు వెళ్తామంటూ ఆయన హెచ్చరించారు.అంతేకాదు ఇప్పటికే ఆయనకు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టకుండా ముందుగానే సస్పెండ్ చేసే అవకాశం కనిపిస్తోంది.
కేసిఆర్ కూడా కోరుకుంటున్నట్టుగా రాజకీయ వర్గాల్లో అనుమానాలు కలుగుతున్నాయి.