కేసీఆర్ ఢిల్లీ టూర్‌.. అందుకేనా ? ప్ర‌భుత్వ భ‌ర్త్‌ర‌ఫ్ త‌ప్ప‌దా ?

తెలంగాణ గులాబీ బాస్‌, సీఎం కేసీఆర్ మ‌రో మాస్ట‌ర్ ప్లాన్‌తో ముందుకు సాగుతున్నారా అంటే అవున‌నే అనిపిస్తోంది.2018లోనూ కేసీఆర్ స‌డెన్‌గా ఢిల్లీ టూర్ పెట్టుకుని మోడీ, అమిత్‌షాల‌ను క‌లిసి హైద‌రాబాద్ రాగానే తెలంగాణ‌లోముంద‌స్తు ఎన్నిక‌లు ప్ర‌క‌టించారు.ఇదే సీన్ మ‌ళ్లీ రిపీట్ కానుంద‌ని స‌మాచారం.మ‌రోసారి తెలంగాణ‌లో ముంద‌స్తు ఎన్నిక‌లు త‌ప్ప‌వా ? అనే చ‌ర్చ సాగుతోంది.

 Reason Behind Cm Kcr Delhi Tour, Cm Kcr, Telangana, Delhi, Trs Ministers, Pm Mod-TeluguStop.com

తాజాగా సీఎం కేసీఆర్ ఉన్న‌ట్టుండి మంత్రుల‌తో అత్య‌వ‌స‌ర సమావేశం పెట్టిన‌ట్టు టాక్ వ‌స్తోంది.కేసీఆర్ త‌న ఫాంహౌస్‌కు మంత్రుల‌ను పిలిపించార‌ని, అంద‌రూ హాజ‌ర‌య్యార‌ని సమాచారం .ప్ర‌స్తుతం కేసీఆర్ అధికారానికి మ‌రో రెండేండ్ల స‌మ‌యం మాత్ర‌మే ఉంది.తిరిగి ఐదేండ్ల ప‌ద‌వి రావాలంటే ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని, లేదంటే ఇక క‌ష్ట‌మ‌నే వార్త‌లు చెక్క‌ర్లు కొడుతున్నాయి.

ఇదే విష‌యాన్ని పొలిటిక‌ల్ స్ట్రాట‌జిస్ట్ ప్ర‌శాంత్ కిశోర్‌(పీకే) కూడా నివేదించార‌ని టాక్‌.

Telugu Amit Shah, Bandi Sanjay, Cm Kcr, Delhi, Pm Modi, Telangana, Trs Ministers

టీఆర్ఎస్ ప్ర‌భుత్వం ఫుల్ టైం ఉండాలంటే వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ రెండు ద‌ఫాల వ్య‌తిరేకత ఉండ‌బోతోంద‌ని కేసీఆర్ మంత్రుల‌ను హెచ్చ‌రించార‌ట‌.ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు పోతే ఆ వ్య‌తిరేక‌త‌ను అధిగ‌మించొచ్చ‌ని కేసీఆర్ డిసైడ్ అయిన‌ట్టు మీడియాలో ప్ర‌చారం జోరందుకుంది.మంత్రుల భేటీ త‌రువాత కేసీఆర్ ఢిల్లీ టూర్ పెట్టుకోవ‌డంతో వాటికి బ‌లం చేకూర్చుతున్నాయి.

ఢిల్లీ పెద్ద‌ల‌ను క‌లిసిన అనంత‌రం ముంద‌స్తు ఎన్న‌క‌ల‌కు వెళ్తార‌ని స‌మాచారం.ఇప్ప‌టికే ఈ టూర్ ఖ‌రారైంది.21న‌(నేడు) ఢిల్లీకి కేసీఆర్ వెళ్ల‌నున్నారు.కేసీఆర్ మంత్రుల బృందం ప్ర‌ధాని మోడీతో స‌హా ప‌లువురు కేంద్ర మంత్రుల‌ను క‌ల‌వ‌నుంది.

పంజాబ్ త‌ర‌హాలో తెలంగాణ‌లో పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోలు చేయాల‌ని కోర‌నున్నార‌ట‌.అదే రోజు టీఆర్ఎస్ ఎల్పీ స‌మావేశం జ‌ర‌గ‌నుంది.

ఈప్ర‌క్రియ ముగియ‌గానే ఓ కీల‌క నిర్ణ‌యం కేసీఆర్ తీసుకోనున్నార‌ట‌.

అయితే కేసీఆర్ ఢిల్లీ టూర్ రాజ‌కీయంగా హీట్ ఎక్కిస్తోంది.

ప్ర‌ధాని మోడీ, అమిత్‌షాల‌ను క‌లిసి వ‌చ్చాక తెలంగాణ‌లో మొంద‌స్తు ఎన్నిక‌లు ప్ర‌క‌టిస్తార‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు పేర్కొంటున్నారు.అంటే 2018 సంఘ‌ట‌న‌లే మ‌రోసారి పున‌రావృతం కానున్నాయ‌ని అర్థం అవుతోంది.

ఇప్ప‌టికే టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డితోపాటు తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ కూడా ఇదే విష‌యాన్ని చెప్పుకొస్తున్నారు.ఆ దిశ‌గానే కేసీఆర్ ప‌య‌ణిస్తున్నాడ‌నే చ‌ర్చ‌సాగుతోంది.

మొత్తంగా కేసీఆర్ ఢిల్లీ టూర్ స‌మ‌స్య ప‌రిష్కారానికా ? ముంద‌స్తు ఎన్నిక‌ల‌కా ? అన్న‌ది తెలియాలంటే వేచి చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube