ఆర్ధిక అవకతవకలతో పాటు పన్ను చెల్లింపులో మోసానికి పాల్పడిన భారత సంతతి వ్యక్తికి అమెరికా కోర్టు జైలు శిక్ష విధించింది.పృథ్వీరాజ్ రోజర్ భిఖా.
సిస్కో సిస్టమ్స్‌లో గ్లోబల్ సప్లయర్ మేనేజ్‌మెంట్‌కు గతంతో సీనియర్ డైరెక్టర్‌గా పనిచేశారు.ఈ సమయంలో ఆయన పన్ను మోసానికి పాల్పడిన నేరం రుజువు కావడంతో 36 నెలల జైలు శిక్షతో పాటు యూఎస్ ఇంటర్నల్ రెవెన్యూ సర్వీసెస్‌కు 3 మిలియన్ డాలర్లను చెల్లించాలని కాలిఫోర్నియాలోని నార్తర్న్ డిస్ట్రిక్ట్ జడ్జి చార్లెస్ ఆర్ బ్రేయర్ తీర్పు వెలువరించారు.
శాన్‌ఫ్రాన్సిస్కోకు చెందిన భిఖా (52).మోసపూరితమైన ట్యాక్స్ రిటర్న్ దాఖలు చేసినందుకు గాను దోషిగా తేల్చారు.ఆయన 1999 నుంచి 2017 వరకు సిస్కోలో ఉద్యోగం చేశారు.ఈ నేపథ్యంలో 2013లో ‘‘ ప్రాజెక్ట్ న్యూయార్క్ ’’ అనే కొత్త ప్రాజెక్ట్‌ను పర్యవేక్షించడానికి సిస్కో అతనికి ప్రత్యేకంగా బాధ్యతలు అప్పగించింది.
సిస్కో ఉత్పత్తులను సమీకరించడం, తయారీదారులతో పొదుపు చర్చలు జరపడం, థర్డ్ పార్టీ విక్రేతలను నిలబెట్టుకోవడం వంటివి ప్రాజెక్ట్ న్యూయార్క్ లక్ష్యం.
అయితే ప్రాజెక్ట్ న్యూయార్క్ పనిచేయడానికి సిస్కో గతంలో నిలిపివేసిన విక్రేత నుంచి భిఖా చెల్లింపులు అందుకున్నట్లుగా ఆయన తన నేరాన్ని అంగీకరించాడు.
అంతేకాకుండా తన సొంత ఉద్యోగుల నుంచి వస్తువులు సేవలను పొందడంపై సిస్కో విధించిన నిషేధాన్ని అతిక్రమించి .ప్రాజెక్ట్ న్యూయార్క్‌లో తన స్వంత కంపెనీని భిఖా విక్రేతగా సృష్టించాడు.అంతేకాదు లుసెనా లిమిటెడ్ పేరుతో ఏర్పాటు చేసిన కంపెనీకి నగదు చెల్లింపులు జరిపినట్లు కూడా అతను అంగీకరించాడు.

అయితే భిఖా భండారం బయటపడటంతో అతనిని సిస్కో ఉద్యోగం నుంచి తప్పించింది.కంపెనీని మోసం చేయడంతో పాటు విదేశీ ఖాతాల నుంచి వచ్చిన 9 మిలియన్ డాలర్ల ఆదాయానికి సంబంధించిన వివరాలను ఐటీ రిటర్న్స్‌లో దాఖలు చేయలేదని భిఖాపై అభియోగాలున్నాయి.2014 నుంచి 2017 మధ్యకాలంలో ఆయన ఈ మోసానికి పాల్పడినట్లు తేలింది.
ఈ నేరాలు రుజువుకావడంతో భిఖాకు 36 నెలల జైలు శిక్షతో పాటు సిస్కోకు 1.15 డాలర్లు, అమెరికా ఇంటర్నల్ రెవెన్యూ సర్వీసెస్‌కు 2.5 మిలియన్ డాలర్లను నష్టపరిహారంగా చెల్లించాలని న్యాయమూర్తి ఆదేశించారు.అంతేకాకుండా శాన్‌ఫ్రాన్సిస్కోలో అతనికి వున్న రెండు భూములను జప్తు చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు.