చిరంజీవి - ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా ఆరోజుల్లో ఎంత వసూళ్లు రాబట్టిందో తెలిస్తే నోరెళ్లబెడుతారు!

మన రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల్లో అన్నీ వర్గాల్లోనూ సమానమైన క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న హీరోల లిస్ట్ తీస్తే ఆరోజుల్లో ఎన్టీఆర్( Senior NTR ) , ఇక ఆ తర్వాతి తరం లో మెగాస్టార్ చిరంజీవి అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రస్థానం తీసుకుంటే వీళ్లిద్దరు సృష్టించిన చరిత్ర ని సువర్ణాక్షరాలతో లిఖించవచ్చు.

 Chiranjeevi Senior Ntr Tiruguleni Manishi Movie Collections,chiranjeevi,senior N-TeluguStop.com

అయితే ఎన్టీఆర్ కేవలం నటుడిగా మాత్రమే కాదు రాజకీయ నాయకుడిగా కూడా రాణించిన సంగతి చిన్న పిల్లవాడికి కూడా తెలుసు.తెలుగు దేశం పార్టీ స్థాపించి కేవలం 10 నెలల్లోనే ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా పోటీ చేసి 270 కి స్థానాలను గెలుపొంది ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించి తెలుగోడి సత్తా ఏమిటో ఢిల్లీ వరకే పాకేలా చేసిన మహానుభావుడు ఆయన.ఇక చిరంజీవి సినీ రంగం లో జనాలపై ఎన్టీఆర్ స్థాయి ప్రభావం చూపినా, రాజకీయ రంగం లో మాత్రం ఎన్టీఆర్ రేంజ్ కి దరిదాపుల్లో కూడా వెళ్లలేకపోయాడు.

Telugu Chiranjeevi, Prajarajyam, Senior Ntr-Movie

కానీ ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో పోటీ చేసి 18 శాతం కి పైగా ఓటు బ్యాంక్( Vote Bank ) ని సంపాదించాడు, ఇక కేవలం ఆంధ్ర ప్రదేశ్ వరకు తీసుకుంటే చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ కి 24 శాతం వోట్ బ్యాంక్ వచ్చింది.ఓవరాల్ గా ఆ పార్టీ కి 18 స్థానాలు వచ్చాయి.40 కి పైగా స్థానాల్లో కేవలం వెయ్యి ఓట్ల తేడా తో ఓడిపోయింది.ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీ లో ప్రజారాజ్యం పార్టీ ని విలీనం చెయ్యడం, కొన్నాళ్ళకు సెంట్రల్ టూరిజం మినిస్టర్ గా కొనసాగడం వంటివి మన అందరికీ తెలిసిందే.ఎన్టీఆర్ రేంజ్ కాకపోయినా రాజకీయాల్లో ఒక కదలిక తెచ్చిన వాడిగా చిరంజీవి నిలిచాడు.

అలా తెలుగు ప్రజల్లో చెరగని ముద్ర వేసిన ఈ ఇద్దరు కలిసి అప్పట్లో ‘తిరుగు లేని మనిషి'( Tiruguleni Manishi ) అనే చిత్రం చేసారు.చిరంజీవి హీరో గా ఇండస్ట్రీ లో అప్పుడప్పుడే నిలదొక్కుకుంటున్న రోజులు అవి.

Telugu Chiranjeevi, Prajarajyam, Senior Ntr-Movie

ఆ సమయం లో చిరంజీవి( Chiranjeevi ) కి ఏకంగా ఎన్టీఆర్ తో కలిసి నటించే ఛాన్స్ దక్కింది.ఎన్టీఆర్ మెయిన్ హీరో కాగా, చిరంజీవి ఈ చిత్రం లో సెకండ్ హీరో.అయ్యినప్పటికీ కూడా వీళ్లిద్దరి మధ్య మంచి సన్నివేశాలే పడ్డాయి.అయితే ఈ సినిమా కమర్షియల్ గా అప్పట్లో పెద్ద డిజాస్టర్ గా నిల్చింది.అప్పటికే ఈ తరహా సినిమాలు ఎన్నో వచ్చాయి, జనాలకు చాలా రొటీన్ అనిపించి, బోర్ ఫీల్ అవ్వడం తో ఇలాంటి ఫలితాన్ని మూటగట్టుకోవాల్సి వచ్చింది.ఆరోజుల్లో ఈ సినిమాని రెండు కోట్ల రూపాయిల బడ్జెట్ తో తీశారు.

నాలుగు కోట్ల రూపాయలకు పైగా( Tiruguleni Manishi Movie Collections ) ఈ చిత్రం ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ని జరుపుకుంది.కానీ సినిమా విడుదలై మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ రావడం తో ఓపెనింగ్స్ బాగానే వచ్చినప్పటికీ ఫుల్ రన్ లో మాత్రం చతికిల పడింది.

అలా ఈ చిత్రం ఆరోజుల్లో రెండు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టినట్టు సమాచారం.అంటే రెండు కోట్ల రూపాయిల నష్టం అన్నమాట, ఆరోజుల్లో 50 శాతం కూడా ఈ చిత్రం బయ్యర్స్ కి రికవరీ చెయ్యలేకపోయిందంటే పెద్ద ఫ్లాప్ అనే అనుకోవాలి.

అలా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో దిగ్గజ స్థాయి లో ఉన్నటువంటి చిరంజీవి , ఎన్టీఆర్ కాంబినేషన్( Chiranjeevi Senior NTR Movies ) లో వచ్చిన ఈ సినిమా ఫ్లాప్ అవ్వడం దురదృష్టకరం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube