మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) చాలా ఆశలు అంచనాలు పెట్టుకొని చేసినా బోళా శంకర్( Bola Shankar ) చిత్రం బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది.చిరంజీవి ఫ్యాన్స్ తో పాటు ప్రతి ఒక్కరు కూడా మంచి కమర్షియల్ మూవీ అని ఎదురు చూశారు.
కానీ సినిమా ఏ మాత్రం ఆకట్టుకోలేక పోయింది అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.ఆ సినిమా కారణంగానో లేదా మరి ఏదైనా విషయము కానీ చిరంజీవి చాలా నెలలుగా షూటింగ్ కి దూరంగా ఉంటున్నాడు.
దాంతో చాలా మంది చాలా రకాలుగా సోషల్ మీడియా లో చిరంజీవి ఆరోగ్యం గురించి పుకార్లు షికార్లు చేస్తున్నారు.చిరంజీవి కి ఆరోగ్యం సరిగా లేక పోవడంతో విదేశాల్లో చికిత్స తీసుకున్నాడు అంటూ కొందరు ప్రచారం చేస్తున్నారు.
అందువల్లే షూటింగ్ కి ఆలస్యం అవుతుందని కూడా వారు అంటున్నారు.

ఇటీవల ఇండియా కు తిరిగి వచ్చిన చిరంజీవి త్వరలోనే బింబిసార దర్శకుడు వశిష్ట( Director Vashishta ) దర్శకత్వం లో రూపొందిబోతున్న సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు అంటున్నారు.వచ్చే నెల వరకే చిరంజీవి విశ్రాంతి లోనే ఉండాలని.డిసెంబర్ నెల నుంచి చిరంజీవి కెమెరా ముందుకు రాబోతున్నాడని మీడియా సర్కిల్స్ లో కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి.
అసలు చిరంజీవి కి ఏమైంది అనే విషయం పై క్లారిటీ లేదు.కొందరు మెగా ఫాన్స్ మాత్రం చిరంజీవి విశ్రాంతి తీసుకుంటున్నారని అంతే తప్ప ఆయన ఆరోగ్యం పూర్తిగా బాగుందని వారు అంటున్నారు.
ఏదేమైనా చిరంజీవి డిసెంబర్ నెలలో కెమెరా ముందుకు రాబోతున్న నేపథ్యం లో ఫ్యాన్స్ చాలా ఆనందంగా ఉన్నారు.వశిష్ట దర్శకత్వం లో రూపొందిపోతున్న చిరంజీవి సినిమా వచ్చే ఏడాది దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తే చూడాలని ఫాన్స్ ఎదురు చూస్తున్నారు.
మరి చిరంజీవి వచ్చే ఏడాది సినిమా ని విడుదల చేస్తాడా అనేది చూడాలి.