Chiranjeevi: రీ ఎంట్రీలో చిరంజీవితో సినిమా చేసి కెరీర్ నాశనం చేసుకున్న డైరెక్టర్స్ వీళ్లే?

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ఎలాంటి అంచనాలు లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇండస్ట్రీలో స్టార్ హీరోగా మంచి సక్సెస్ అందుకున్నారు.ఇలా స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి ఈయనకు ఎంతోమంది దర్శక నిర్మాతలు భారీ స్థాయిలో అవకాశాలను కల్పించారు.

 Chiranjeevi Movies Career Flop Directors Koratala Siva Vv Vinayak Surender Redd-TeluguStop.com

వాటిని ఎంతో సద్వినియోగం చేసుకున్నటువంటి చిరంజీవి అతి తక్కువ సమయంలోనే తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా గుర్తింపు పొందారు.ఇక ఈయనని స్ఫూర్తిగా తీసుకొని ఎంతో మంది హీరోలు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి మనకు తెలిసిందే.

ఇలా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా సక్సెస్ అందుకున్నటువంటి ఈయన తన సినీ కెరియర్ కు బ్రేక్ ఇస్తూ రాజకీయాలలోకి వచ్చారు.ప్రజారాజ్యం పార్టీని స్థాపించినటువంటి చిరంజీవికి రాజకీయపరంగా ఎన్నో అవమానాలు ఎదురవడంతో ఈయన పూర్తిగా రాజకీయాలకు దూరమయ్యారు.

ఇలా రాజకీయాలు తమకు సెట్ కావు అని తెలుసుకున్నటువంటి చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్ పార్టీలోకి( Congress ) విలీనం చేసే తిరిగి సినిమా ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చారు .ఇలా రీ ఎంట్రీ ఇస్తూనే పలువురు దర్శకులకు అవకాశాలు కల్పించారు అయితే ఈయన నటించిన ఏ సినిమా కూడా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిందని చెప్పాలి.రీ ఎంట్రీలో చిరంజీవితో సినిమాలు చేసే భారీ డిజాస్టర్ లను ఎదుర్కోవడమే కాకుండా తదుపరి ఎలాంటి హిట్ సినిమాలను కూడా అందుకోలేదు మరి ఆదర్శకులు ఎవరు అనే విషయానికి వస్తే.

Telugu Acharya, Chiranjeevi, Flop Directors, Khaidi, Koratala Siva, Surender Red

చిరంజీవి ఎంట్రీ ద్వారా తన 150వ చిత్రం వివి వినాయక్ (V.V Vinayak) దర్శకత్వంలో ఖైదీ నెంబర్ 150( Khaidi No.150 ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ వచ్చినా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిందని చెప్పాలి.ఈ సినిమా తర్వాత వి వి వినాయక్ ఎలాంటి సినిమాలకు దర్శకత్వం వహించలేదు.

ఇక ఈయన బాలీవుడ్ చత్రపతి సినిమాని చేసిన ఇది కూడా డిజాస్టర్ గానే మిగిలింది.అదేవిధంగా సురేందర్ రెడ్డి(Surender Reedy) దర్శకత్వంలో తన కుమారుడు రామ్ చరణ్ నిర్మాణంలో వచ్చినటువంటి సైరా నరసింహారెడ్డి( Syeraa Narasimha Reddy ) అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Telugu Acharya, Chiranjeevi, Flop Directors, Khaidi, Koratala Siva, Surender Red

ఈ సినిమా కూడా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడమే కాకుండా రామ్ చరణ్ కు భారీ స్థాయిలో నష్టాలను కూడా తీసుకువచ్చిందని చెప్పాలి.ఇక ఈ సినిమా తర్వాత సురేందర్ రెడ్డి కూడా ఎలాంటి సక్సెస్ అందుకోలేకపోయారు.ఈయన ఈ సినిమా తర్వాత అఖిల్ హీరోగా ఏజెంట్ అనే సినిమాకి దర్శకత్వం వహించారు.అది కూడా డిజాస్టర్ గానే నిలిచింది.ఇక తదుపరి రామ్ చరణ్ చిరంజీవి ఇద్దరు కలిసి రాంచరణ్ నిర్మాణంలో నటించిన చిత్రం ఆచార్య( Acharya ) అప్పటి వరకు ఎలాంటి అపజయం లేనటువంటి డైరెక్టర్ కొరటాల శివ(Koratala Shiva) దర్శకత్వంలో ఈ సినిమా రాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున అంచనాలు ఏర్పడ్డాయి.

Telugu Acharya, Chiranjeevi, Flop Directors, Khaidi, Koratala Siva, Surender Red

ఇలా ఎన్నో అంచనాల నడుమ విడుదలైనటువంటి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.ఇక ఈ సినిమా విషయంలో కొరటాల చాలా కాలం పాటు బయటపడలేకపోయారని చెప్పాలి.ఇక ఆచార్య డిజాస్టర్ నుంచి కోలుకున్నటువంటి ఈయన ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్నటువంటి దేవర అనే సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.

ప్రస్తుతం ఈ సినిమాపైనే కొరటాల ఆశలు పెట్టుకున్నారు.ఈ సినిమా వచ్చేయడాది ఏప్రిల్ 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఏది ఏమైనా చిరంజీవి ఎంట్రీ తర్వాత నటించిన ఈ డైరెక్టర్లు డిజాస్టర్ సినిమాలను ఎదుర్కోవడంతో వారి కెరియర్ పై తీవ్రమైన ప్రభావం చూపించిందని చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube