చిరంజీవి సినిమా వల్ల యమ భక్తుడిగా మారిన వ్యక్తి.. ఆ పిచ్చితో ఏం చేశాడో తెలుసా ?

భారతదేశం హిందూ సనాతన ధర్మాలను పాటిస్తుంది.ఇక్కడ దేవుళ్లకు కొదవలేదు ముక్కోటి దేవతలను ఆరాధించడం మన హిందువులకు ఆది నుంచి అలవాటు.

 Chiranjeevi Movie Affect On A Person , Chiranjeevi , Chiranjeevi Movie , Chiranj-TeluguStop.com

ఎంతమంది దేవుళ్ళు దేవతలు ఉన్నా కూడా భూమండలంపై ఆలయం లేని దేవుడు యమధర్మరాజు.ప్రాణాలను హరించే యముడికి ఆలయం కట్టడానికి, పూజలు చేయడానికి హిందువులు ఒప్పుకోరు.

కానీ మనం ఇప్పుడు చెప్పుకోబోయే సంఘటన చిరంజీవి సినిమా వల్ల జరిగింది.ఆయన నటించిన ఓ చిత్రం వల్ల ఒక వ్యక్తి యమధర్మరాజుకి భక్తుడిగా మారిపోయాడు.

ఆ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఆంధ్రప్రదేశ్ జిల్లాలోని, కోనసీమ ప్రాంతంలో ఉన్న అంబాజీపేట గ్రామంలో ఓ వ్యక్తి ప్రస్తుతం యమధర్మరాజుకి భక్తుడిగా ఉన్నాడు.

చిరంజీవి యువధర్మరాజుగా నటించిన మంజునాథ సినిమా చూసిన తర్వాత సదరు వ్యక్తి యముడికి పిచ్చిపిచ్చిగా భక్తుడు అయిపోయాడు.మంజునాథ సినిమాలో చావు అందరికీ సమానమే అంటూ శివుడికి అతి ప్రీతిపాత్రుడుగా ఉన్న తన భక్తుడిని తీసుకెళ్లడానికి యమధర్మరాజు స్వయంగా రావడంతో ఆయన పాటించిన ధర్మం పట్ల ఈ వ్యక్తికి అభిమానం కలగడంతో అప్పటినుంచి యమధర్మరాజుని దేవుడుగా ఆరాధిస్తున్నాడు.

Telugu Ambaji Peta, Andra Pradesh, Arjun, Chiranjeevi, Chiranjeevi Fan, Konaseem

దాంతో అప్పటి నుంచి నిత్యం యమధర్మరాజుని స్మరిస్తూ ఆయన పూజలు చేస్తూ ఎల్లప్పుడూ ఆయన ధ్యాసలోనే మునిగితేలుతున్నాడు.అలా చేస్తే తన నుంచి చావు దూరమవుతుందనేది సదరు అభిమాని యొక్క వాదన.అలా చేస్తేనే మనశ్శాంతిగా కూడా ఉంటుంది అని చెప్తున్నాడు.అంతేకాదు యమధర్మరాజు పేరుని తన చేతి పై పచ్చబొట్టు కూడా వేయించుకున్నాడు ఈ అభిమాని.ఏదిఏమైనా ఆ చిరంజీవి నటించిన ఈ సినిమా ద్వారా ఒక వ్యక్తి యమధర్మరాజుకి భక్తుడుగా మారడమే కాదు యవధర్మరాజుని అంటూ మాట్లాడడం విచిత్రంగా అనిపిస్తుంది కదా.ఇక ఈ సంఘటన పట్ల ప్రస్తుతం సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.యమధర్మ రాజుకు కూడా భక్తులు ఉంటారా అంటూ నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube