రామ్ చరణ్ బుచ్చిబాబు సినిమాలో చిరంజీవి.. ఆచార్య సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తామంటూ?

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్( Ram Charan ), దర్శకుడు బుచ్చిబాబు ( Buchi Babu )కాంబినేషన్ లో ఆర్సి 16 సినిమా రూపొందునున్న విషయం అందరికీ తెలిసిందే.ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) కూడా నటించబోతున్నట్లు తెలుస్తోంది.

 Chiranjeevi Is Also Part Of Ram Charan Rc16 Movie, Chiranjeevi , Ram Charan,rc16-TeluguStop.com

అయితే ఇదివరకు రామ్ చరణ్ సినిమాలలో మెగాస్టార్ చిరంజీవి కనిపించినప్పటికీ అందులో ఎవరో ఒకరు గెస్ట్ రోల్‌కే పరిమితమయ్యారు.కానీ బుచ్చిబాబు డైరెక్షన్‌లో వచ్చే సినిమాలో మాత్రం మెగాస్టార్ ఫుల్‌ రోల్ లో కనిపించనున్నాడట.

ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తోంది.

Telugu Buchhi Babu, Chiranjeevi, Ram Charan, Rc-Movie

ఈ ఏడాది డిసెంబర్‌ లేదా వచ్చే ఏడాది జనవరిలో ఈ సినిమా ప్రారంభం కానుంది.మరి ఈ సినిమాలో చిరంజీవి ఎలాంటి రోల్ లోకనిపించబోతున్నాడు అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.స్పోర్ట్స్ బ్యాక్‌గ్రౌండ్‌తో గ్రామీణ నేపథ్యంతో తెరకెక్కే ఈ సినిమాలో రామ్ చరణ్ కోచ్‌గా కనిపించబోతున్నారట.

స్పోర్ట్స్‌లో హీరోకు మెలకువలు నేర్పే పాత్రకు ఎవరిని తీసుకుందామనే ఆలోచన చేస్తుండగా మెగాస్టార్ చిరంజీవి అయితే మంచి హైప్ ఉంటుందని భావించిందట చిత్రం యూనిట్.అలాగే మెగాస్టార్ చిరంజీవి కూడా ఆ పాత్రలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.

Telugu Buchhi Babu, Chiranjeevi, Ram Charan, Rc-Movie

దీంతో ఈ మూవీ పై అంచనాలు మరింత పెరిగాయి.మరొకవైపు రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ చేంజెర్ సినిమాలో ( Game Changer )నటిస్తూ బిజీ బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే.ఇందులో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే.ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచేసాయి.ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.రామ్ చరణ్ పాన్ ఇండియా హీరోగా మారిన తర్వాత వస్తున్న మొట్టమొదటి సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయని చెప్పవచ్చు.

అంతేకాకుండా ఈ సినిమాతో ఆచార్య సినిమా సెంటిమెంట్ ని కూడా చేయబోతున్నట్టు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube