గత ఏడాదిలో జరిగిన పారాలింపిక్స్ లో 400 మీటర్ల పరుగు టీ 20 విభాగంలో కాంస్య పతకం సాధించిన తెలంగాణ బిడ్డ జీవాంజీ దీప్తిని ( Jeevanji Diptini )తాజాగా మెగాస్టార్ చిరంజీవి ( Megastar Chiranjeevi )అభినందించారు.ఈ విషయన్ని జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఇలా తెలిపారు.
ఇటీవల మన తెలుగు రాష్ట్రాల నుంచి పారా అథ్లెట్ ఒలింపిక్స్ లో దీప్తి జీవాంజి కాంస్య పతకం సాధించిన విషయం తెలిసిందే.వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ అనే చిన్న గ్రామంలో జన్మించిన జీవాంజీ దీప్తి దేశానికి ఎంతో పేరు తెచ్చింది.
అయితే ఒలింపిక్స్ లో మెడల్ సాధించిన సందర్భంగా మీకేం కావాలని నేను ఆమెను అడిగినప్పుడు, చిరంజీవి గారిని కలవాలని ఉందని చెప్పారు.
ఇటీవల నేను చిరంజీవిగారిని ఒక సందర్భంలో కలిసినప్పుడు దీప్తి జవాంజి గురించి చెప్పాను.ఆయన చాలా గొప్ప మనసుతో స్పందించారు.చాలా పెద్ద అచీవ్‌మెంట్ చేసినప్పుడు, ఆమె రావటం కాదు, నేను అకాడమీకి వస్తానని అన్నారు.
అన్నట్లుగానే చిరంజీవిగారు మా అకాడమీకి వచ్చి, అక్కడున్న పిల్లలందరినీ కలిశారు.రెండు గంటల పాటు అక్కడే గడిపారు.
అలాగే ప్రతి ప్లేయర్ ని ఇన్‌స్పైర్ చేసే విధంగా మాట్లాడారు.ఇదే సందర్భంలో ఆయన మూడు లక్షల రూపాయల చెక్ ( three lakh rupees )ను దీప్తికి అందించటం మాక ఎంతో సంతోషాన్ని ఇచ్చింది.
ఇది మా క్రీడాకారులకు చిరంజీవి గారు ఇచ్చిన గొప్ప గౌరవంగా నేను భావిస్తాను.
ఈ ఇన్‌స్పిరేషన్ తో చాలా మంది మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని నేను భావిస్తున్నాను అని ఆయన అన్నారు.ఈ సందర్భంగా ఆయన చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దీప్తిని పొగుడుతూనే చిరంజీవి చేసిన పనికి కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.మెగాస్టార్ చేసిన పని చాలామందిలో పట్టుదల గెలవాలి అనే కసిని పెంచుతుంది అంటూ కామెంట్ చేస్తున్నారు.
ఇకపోతే చిరంజీవి త్వరలోనే విశ్వంభరామయ్య మూవీ తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.ఈ సినిమా ఏప్రిల్ లో విడుదల కానుంది.జనవరి కి వాయిదా కావాల్సి ఉండగా కొడుకు కోసం ఈ సినిమాను వాయిదా వేసుకున్నారు.