సుస్మిత కొణిదెల (Sushmitha) పరిచయం అవసరం లేని పేరు.ఈమె మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) కుమార్తెగానే కాకుండా కాస్ట్యూమ్ డిజైనర్ గాను అందరికీ పరిచయమే.
ఇక ఈమె గోల్డెన్ బాక్స్ నిర్మాణ సంస్థను స్థాపించి సినిమాలను నిర్మిస్తున్నారు.ఇలా పలు సినిమాల నిర్మాతగా కూడా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.
ఇకపోతే చిరంజీవి తర్వాత సైరా నరసింహారెడ్డి సినిమా నుంచి మొదలుకొని చిరంజీవి ప్రతి సినిమాలకు సుస్మిత కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేస్తున్నారు.అయితే తాజాగా చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమాలో( Bhola Shankar ) చిరంజీవి కాస్ట్యూమ్స్ విషయంలో సుస్మితను కూడా తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు.
ఈ సినిమాలో చిరంజీవి కాస్ట్యూమ్స్ ఏమాత్రం బాగాలేవని పలువురు ఈమె పట్ల విమర్శలు కురిపిస్తున్నారు.చాలా ఓల్డ్ మోడల్ డిజైనింగ్ చేశారని అదేవిధంగా సైరా నరసింహారెడ్డి సినిమా విషయంలో కూడా కాస్ట్యూమ్స్ అందరిని మెప్పించలేక పోయాయని తెలుస్తుంది.అయితే సైరా నరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలు కాస్త సక్సెస్ కావడంతో చిరంజీవి కాస్ట్యూమ్స్ పై( Chiranjeevi Costumes ) పెద్దగా దృష్టి పెట్టలేదు అయితే చిరంజీవి తదుపరి సినిమాలకు ఆయనకు అనుగుణంగానే కాస్ట్యూమ్స్ డిజైన్ చేయాలని పలువురు భావిస్తున్నారు.అయితే రంగస్థలం సినిమాలో మాత్రం రామ్ చరణ్ కు ఈమె డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్ ఎంతో అద్భుతంగా సెట్ అయ్యాయని తెలుస్తోంది.
ఇకపోతే చిరంజీవి తన తదుపరి చిత్రాన్ని తన కుమార్తె సుస్మిత గోల్డెన్ బాక్స్ బ్యానర్ లోనే( Golden Box Banner ) చేస్తున్నారు.మరి ఈ సినిమా కోసం చిరంజీవి కాస్ట్యూమ్ డిజైనర్ గా సుస్మిత వ్యవహరిస్తారా లేకపోతే మరెవరినైనా నియమిస్తారా అన్నది తెలియాల్సి ఉంది.అయితే ఈ సినిమా విషయంలోనైనా సుస్మిత కాస్త కాస్ట్యూమ్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని మెగా ఫాన్స్ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.ఇక ఈ సినిమాకు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించబోతున్నారని తెలుస్తుంది.