వరుస విజయాలతో నిఖిల్ సిద్ధార్థ్( Nikhil Siddharth ) మంచి జోరు మీద ఉన్న నేపథ్యంలోనే ఈయన జోరుకు బ్రేకులు వేసేందుకు స్పై వచ్చింది.స్పై సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు.
నిఖిల్ కెరీర్ లో కార్తికేయ 2( Karthikeya 2 ) సృష్టించిన సంచలనం అంతా ఇంత కాదు.తెలుగులో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోగా పేరు తెచ్చుకున్న నిఖిల్ ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు.
ఆ తర్వాత వచ్చిన 18 పేజెస్ కూడా మంచి విజయం సాదించింది.దీంతో ఈ కుర్రహీరోతో సినిమా చేయడానికి దర్శక నిర్మాతలు భారీగా పోటీ పడుతున్నారు.అయితే ఈ మధ్యనే వచ్చిన స్పై( Spy Movie ) నిరాశ పరిచిన ఈయన క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు.ప్రస్తుతం తన కెరీర్ లో 20వ సినిమా చేస్తున్నాడు.
భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.
ఇక ఈ సినిమాను పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్ పై భువన్, శ్రీకర్ లు సంయుక్తంగా నిర్మిస్తుండగా రవి బసృర్ సంగీతం అందిస్తున్నారు.
ఈ సినిమా యువ యోధుడిని వర్ణించే పురాణ ఫాంటసీ కథ అని తెలుస్తుంది.ఇక ఈ సినిమాకు ”స్వయంభు”( Swayambhu ) అనే టైటిల్ ను ఖరారు చేసారు.
తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనే విషయంలో క్లారిటీ తెలుస్తుంది.
నిఖిల్ సరసన సంయుక్త మీనన్( Samyuktha Menon ) హీరోయిన్ గా ఎంపిక అయ్యినట్టు తెలుస్తుంది.ఆగస్టు 18న ఈ సినిమా గ్రాండ్ లాంచింగ్ వేడుక జరగనుండగా నిఖిల్ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది.ఇక దీంతో పాటు నిఖిల్ హీరోగా ‘ది ఇండియా హౌస్'( The India House ) పేరుతో రామ్ చరణ్ నిర్మాతగా వి మెగా పిక్చర్స్ బ్యానర్ పై సినిమా తెరకెక్కుతున్న విషయం విదితమే.
ఇలా ఈ యువ హీరో కంటెంట్ ఓరియెంటెడ్ కథలను ఎంచుకుంటూ పాన్ ఇండియా రేంజ్ లో దూసుకు పోతున్నాడు.