టైటిల్ చూసి ఆశ్చర్యంగా ఉంది.అసలు విషయం ఏంటి అంటే చిరంజీవి తో భగవంత్ కేసరి సినిమా( Bhagwant Kesari movie ) ను రూపొందించిన అనిల్ రావిపూడి ఒక సినిమాను చేయబోతున్నాడు.
బాలయ్య కి ఒక మంచి కమర్షియల్ హిట్ ను ఇచ్చిన అనిల్ రావిపూడి( Anil Ravipudi ) ఇటీవల మెగాస్టార్ చిరంజీవికి కథ చెప్పడం జరిగింది.వీరి కాంబోలో సినిమా ను దిల్ రాజు( dil raju ) నిర్మించేందుకు రెడీగా ఉన్నాడు.
ఇప్పటికే అనిల్ చెప్పిన కథ కు చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అంటూ సమాచారం అందుతోంది.ఇక మిగిలినది దిల్ రాజు చేతిలో ఉంది.
చిరంజీవి డిమాండ్ చేస్తున్న పారితోషికం విషయం లో నిర్మాత దిల్ రాజు కాస్త వెనుక ముందు ఆడుతున్నాడట.

దాంతో చిరంజీవి, అనిల్ రావిపూడి సినిమా ఆలస్యం అవుతోంది.ఒక వేళ దిల్ రాజు బడ్జెట్ విషయంలో చూసి చూడనట్లుగా వదిలేస్తే చిరంజీవి( Chiranjeevi ) భగవంత్ కేసరి దాదాపుగా కన్ఫర్మ్ అయినట్లే.వశిష్ట దర్శకత్వంలో సినిమా ని చిరంజీవి మొదలు పెట్టాడు.
మరో వైపు అనిల్ రావిపూడి దర్శకత్వంలో కూడా సినిమా ను చేసేందుకు వచ్చే ఏడాది సంక్రాంతి తర్వాత డేట్లు ఇచ్చేందుకు చిరంజీవి రెడీగా ఉన్నాడట.మరి దిల్ రాజు ఇంకా బేరాలు కుదరలేదు అంటున్నాడు.
చిరంజీవి అడిగిన పారితోషికం విషయం లో దిల్ రాజు సంతృప్తిగా లేడు అంటున్నారు.చిరంజీవి తో సినిమా ను నిర్మించేందుకు ఎంత పెద్ద నిర్మాత అయినా ఆసక్తి చూపిస్తూ ఉంటారు.

చిరు తో సినిమా నిర్మించే అవకాశం రావడం గొప్ప విషయం.అలాంటిది పారితోషికం విషయం లో బేరాలు ఆడి పోగొట్టుకునే అవకాశం లేదు.కానీ దిల్ రాజు ప్రాజెక్ట్ పై ఎక్కువ బడ్జెట్ పెట్టే ఉద్దేశ్యంతో పారితోషికం విషయం లో కాస్త బేరాలు ఆడుతున్నాడు అంటూ కొందరు మాట్లాడుకుంటూ ఉన్నారు.అసలు విషయం ఏంటి, చిరు, అనిల్ రావిపూడి కాంబో మూవీ ఎప్పుడు పట్టాలెక్కబోతుంది అనేది తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.