ఆర్.ఆర్.ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ ఏ స్థాయిలో హిట్టైందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.నాటు నాటు సాంగ్ కు ఏకంగా 46 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.
అయితే నాటు నాటు సాంగ్ కు చరణ్ అత్తయ్య డ్యాన్స్ చేయగా ఆ వీడియోకు లవ్ యూ అంటూ ఉపాసన ట్వీట్ చేశారు.ఉపాసన తల్లి శోభన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
ఆర్.ఆర్.ఆర్ సినిమాకు, నాటు నాటు సాంగ్ కు వస్తున్న అవార్డుల విషయంలో ఆమె సంతోషం వ్యక్తం చేశారు.
తాము ఎక్కడికి వెళ్లినా అక్కడ రామ్ చరణ్ గురించి ఎక్కువగా చర్చ జరుగుతోందని శోభన చెప్పుకొచ్చారు.
ఒక ఆంగ్ల పత్రికతో మాట్లాడిన శోభన విలేకరి కోరిక మేరకు నాటు నాటు సాంగ్ కు తను కూడా డ్యాన్స్ వేశారు.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా ఆ వీడియో గురించి ఉపాసన స్పందిస్తూ అల్లుడి ఘనతకు m>అత్తయ్య ఆనందంతో గర్విస్తున్నారని చెప్పుకొచ్చారు.
లవ్ యూ అమ్మా అంటూ ఉపాసన చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నాటు నాటు సాంగ్ చరణ్ కు ఏ స్థాయిలో క్రేజ్ ను తెచ్చిపెట్టిందో ఈ విషయాల ద్వారా అర్థమవుతోంది.శోభన ఇంటర్వ్యూలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు ఆర్.ఆర్.ఆర్ సినిమాపై అభిమానం చూపిస్తున్నారని శోభన కామినేని పేర్కొన్నారు.ఆర్.ఆర్.ఆర్ అద్భుతమైన మూవీగా పేరు తెచ్చుకుంటుందని అనుకున్నామని అంతర్జాతీయంగా ఈ స్థాయిలో గుర్తింపు దక్కుతుందని భావించలేదని శోభన పేర్కొన్నారు.
ఆర్.ఆర్.ఆర్ సక్సెస్ తో విదేశాల్లో కూడా చరణ్ క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది.చరణ్ కు 100 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటుండగా శంకర్ సినిమాతో సక్సెస్ ను అందుకుంటే 150 కోట్ల రూపాయల స్థాయికి పెరిగే ఛాన్స్ అయితే ఉంది.