ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడుతున్నాయి.దీంతో నేతలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ ఉన్నారు.
తాజాగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై విజయవాడ ఎంపీ కేశినేని( MP Kesineni Nani ) నాని సీరియస్ వ్యాఖ్యలు చేయడం జరిగింది.ఏపీలో జరగబోయే ఎన్నికలకు సంబంధించి చంద్రబాబు టికెట్లు అమ్ముకుంటున్నారని విమర్శలు చేయడం జరిగింది.
గురువారం మీడియాతో నాని మాట్లాడుతూ చంద్రబాబు( Chandrababu ) టికెట్లు అమ్ముకుని చివరకు తెలంగాణకి వెళ్ళిపోతారని సంచలన వ్యాఖ్యలు చేశారు.చంద్రబాబుకి ఇవే చివరి ఎన్నికలని అన్నారు.
ఓటమి తర్వాత రాజకీయాల నుంచి తప్పుకుంటారని షాకింగ్ కామెంట్స్ చేశారు.
వైయస్ జగన్( YS Jagan ) ని చూసి చంద్రబాబు సిగ్గు తెచ్చుకోవాలని సీరియస్ కామెంట్స్ చేశారు.చంద్రబాబు పచ్చి మోసగాడు.ఆయన మాటలను నమ్మే పరిస్థితులలో ఏపీ ప్రజలు లేరని వ్యాఖ్యానించారు.2014లో నమ్మి మోసపోయామని ప్రజలకు తెలుసని అన్నారు.వచ్చే ఎన్నికలలో వైసీపీ పార్టీ మరోసారి గెలుస్తుందని స్పష్టం చేశారు.
ఇదే సమయంలో మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా చంద్రబాబుపై మండిపడ్డారు.చంద్రబాబు మాదిరిగా కుర్చీ లాక్కునే అలవాటు తనకు లేదని వ్యాఖ్యానించారు.
తనపై విమర్శలు చేస్తున్న నేతలు ఆ లక్షణాలు మీ అధినాయకుడికే ఉన్నాయని తెలుసుకోండని కౌంటర్ ఇచ్చారు.చంద్రబాబు.
దత్తపుత్రుడు మాటలను ప్రజలు నమ్మరని విమర్శించారు.వంద రోజులలో వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తుందని పేర్కొన్నారు.