సీనియర్ జర్నలిస్ట్ ఆలపాటి సురేష్ కుమార్ రచించిన “విధ్వంసం( Vidhwamsam )” పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం విజయవాడలో జరిగింది.గురువారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు.
ఈ క్రమంలో పుస్తకాన్ని ఆవిష్కరించిన చంద్రబాబు తొలి కాపీని పవన్ కళ్యాణ్ కి అందజేశారు.అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ తాను పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )వైసీపీ బాధితులం అని పేర్కొన్నారు.
దేశ చరిత్రలో ఎక్కడ లేని రీతిలో ఆంధ్రప్రదేశ్ లో మీడియాపై ఆంక్షలు విధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.రాష్ట్రానికి వచ్చే పరిశ్రమలను వెళ్లగొట్టిన ఏకైక సీఎం జగన్ అని విమర్శించారు.
అమరరాజా బ్యాటరీస్ సంస్థను వేధించి తెలంగాణకు పంపించారు.పేదలకు ఆహారం అందించే అన్న క్యాంటీన్లను మూసేశారు.
జనసేన “ఇప్పటం” సభకు ప్రజలు స్థలం ఇచ్చారని రోడ్లు వెడల్పు పేరుతో వారి ఇళ్లను కూల్చేశారు.అని చంద్రబాబు విమర్శలు( Chandrababu Naidu ) చేయడం జరిగింది.ఇదే కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వం పై మండిపడ్డారు.కూల్చివేతలతోనే మొదలైన ప్రభుత్వం చివరికి కూలిపోతుందని అన్నారు.నేను మొదటి నుంచి ఇదే చెబుతున్నాను అని పవన్ వ్యాఖ్యానించారు.ఇలాంటి ప్రభుత్వాన్ని కూల్చేయాలంటే.
ప్రతిపక్షాలనీ ఒకటవ్వాలి.ఎలాంటి భావోద్వేగాలకు లోను కాకుండా.
ఎవరి పక్షాన నిలవకుండా ఒక నిజమైన జర్నలిస్టు రిపోర్టు చేస్తే ఎలా ఉంటుందో ఈ “విధ్వంసం” పుస్తకాన్ని ఆలపాటి సురేష్ అంత గొప్పగా రాశారు నిజమైన జర్నలిస్టు అంటూ పవన్ కళ్యాణ్ ప్రశంసలు వర్షం కురిపించారు.