ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో రెండు నెలలలో ఎన్నికలు( AP Elections ) జరగనున్నాయి.దీంతో ప్రధాన పార్టీలు ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీగా గడుపుతున్నాయి.
ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ “సిద్ధం”( YCP Siddham ) సభలతో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుంది.మరోపక్క తెలుగుదేశం పార్టీ “రా కదలిరా” ( Raa Kadali Raa )సభలతో హోరెత్తిస్తుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా “రా కదలిరా” సభలతో చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంపై మండిపడుతున్నారు.తాజాగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో “రా కదలిరా” సభ టీడీపీ నిర్వహించింది.
ఈ సభకు భారీ ఎత్తున జనాలు హాజరయ్యారు.ఈ సభలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సంచలన స్పీచ్ ఇచ్చారు.
వచ్చే ఎన్నికలలో కచ్చితంగా తెలుగుదేశం జనసేన ప్రభుత్వం( TDP Janasena ) వస్తుందని స్పష్టం చేశారు.2014లో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో అన్ని స్థానాలు గెలవడం జరిగింది.అవే ఫలితాలు ఇప్పుడు జరగబోయే ఎన్నికలలో రిపీట్ అవుతాయి అని అన్నారు.ఈ సైకో ముఖ్యమంత్రి మరో 60 రోజుల్లో ఇంటికి వెళ్లి పోవడం గ్యారెంటీ అని అన్నారు.కచ్చితంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో అన్ని స్థానాలు గెలుస్తాం గెలుపు మనదే అని అన్నారు.2014 ఎన్నికల ఫలితాలే ఈసారి రిపీట్ అవుతాయని పేర్కొన్నారు.64 రోజుల్లో ఈ సైకో ఇంటికి పోతారు.రాష్ట్రానికి శుభం జరుగుతుంది అని చంద్రబాబు సంచలన స్పీచ్ ఇవ్వటం జరిగింది.