టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈనెల 27 కుప్పం నుండి పాదయాత్ర స్టార్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో హైదరాబాద్ లో జూబ్లీహిల్స్ లో తల్లిదండ్రులు చంద్రబాబు, భువనేశ్వరి ఇంక నందమూరి కుటుంబ సభ్యుల పెద్దల ఆశీర్వాదాలను లోకేష్ తీసుకోవడం జరిగింది.
ఈ సందర్భంగా కొడుకు లోకేష్ నీ చంద్రబాబు ఆప్యాయంగా కౌగిలించుకున్నారు.తర్వాత అత్తమామలు మిగతా నందమూరి కుటుంబ సభ్యులు లోకేష్ కీ ఆశీర్వాదం ఇవ్వటం జరిగింది.ఇదే సమయంలో భార్య బ్రాహ్మణి తిలకం దిద్ది హారతి ఇచ్చారు.ఈ సమయంలో కొడుకు దేవాన్ష్ నీ అప్యాయంగా దగ్గరకు తీసుకోవడం జరిగింది.
అనంతరం ఎన్టీఆర్ ఘాట్ వద్ద సీనియర్ నేత కంభంపాటి రామ్మోహన్ రావు, టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ తో కలిసి ఎన్టీఆర్ కు శ్రద్ధాంజలి ఘటించారు. “యువగళం” పేరిట రాష్ట్రవ్యాప్తంగా లోకేష్ 400 రోజులపాటు 4000 కిలోమీటర్ లు… పాదయాత్ర చేయనున్నారు.కుప్పం నుండి ప్రారంభం కాబోతున్న ఈ పాదయాత్రని టీడీపీ పెద్దలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.