కడప ఎంపీ అవినాశ్ రెడ్డి సీబీఐ మూడో రోజు విచారణ ముగిసింది.సుమారు ఆరు గంటలపాటు సీబీఐ అధికారుల బృందం అవినాశ్ రెడ్డిని ప్రశ్నించింది.
ఈ క్రమంలో అవినాశ్ రెడ్డి విచారణ మొత్తాన్ని వీడియోగ్రఫీ చేశారు అధికారులు.
రేపు రంజాన్ పండుగ నేపథ్యంలో విచారణ ఉంటుందా? లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.అయితే రేపటి విచారణపై ఇవాళ సాయంత్రం సమాచారం ఇస్తామని సీబీఐ పేర్కొంది.కాగా మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాశ్ రెడ్డిని సీబీఐ అధికారులు విచారిస్తున్న సంగతి తెలిసిందే.