కెనడాలో అసంఖ్యాకంగా నివసిస్తోన్న హిందువులకు ఆ దేశ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.నవంబర్‌ను ‘‘హిందూ వారసత్వ మాసం’’గా ప్రకటించాలన్న తీర్మానానికి కెనడియన్ హౌస్ ఆఫ్ కామన్స్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.
భారత్‌లోని పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలకు వెళ్లొద్దంటూ కెనడా ప్రభుత్వం.తమ పౌరులకు అడ్వైజరీ జారీ చేసిన తర్వాత ఈ తీర్మానం ఆమోదం పొండం గమనార్హం.
అయితే నవంబర్ నెల హిందూ వారసత్వ మాసం కావడానికి ఇంకా సమయం పడుతుంది.ఎందుకంటే దీనికి సెనేట్ ఆమోదం లభించాల్సి వుంది.
కెనడాలో ఇలాంటి వారసత్వ నెలలు ఇప్పటికే ఐదు వున్నాయి.మే నెలను కెనడియన్ యూదు వారసత్వ మాసంగా, అక్టోబర్‌ను కెనడియన్ ఇస్లామిక్ చారిత్రక మాసంగా, ఏప్రిల్‌ను ‘‘సిక్కు వారసత్వ మాసం’’గా పాటిస్తారు.
కాగా.ఒట్టావాలోని నేపియన్ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న అధికార లిబరల్ పార్టీ ఎంపీ , భారత సంతతికి చెందిన చంద్ర ఆర్య ఈ ఏడాది మేలో నవంబర్‌ను హిందూ వారసత్వ మాసం గా గుర్తించాలంటూ తీర్మానం ప్రవేశపెట్టారు.
దీనికి 14 మంది జాయింట్ సెకండర్లు పార్టీలకు అతీతంగా మద్ధతు పలికారు.కెనడా సామాజిక, ఆర్ధిక అభివృద్ధికి హిందూ కెనడియన్లు చేసిన కృషిని, కెనడా సమాజానికి వారి సేవలను, హిందూ వారసత్వ సంపదను గుర్తించడానికి సహకరించాలని తీర్మానంలో తెలిపారు.
సైన్స్, ఖగోళ శాస్త్రం, వైద్యం, హిందూ సంస్కృతి, సంప్రదాయాల గురించి కెనడాలోని భవిష్యత్ తరాలకు అవగాహన కల్పించేందుకు ప్రతి ఏడాది హిందూ వారసత్వ మాసంగా ప్రకటించాలని ఆయన తీర్మానంలో కోరారు.
పార్లమెంట్‌లో తీర్మానం ప్రవేశపెడుతూ చంద్ర ఆర్య మాట్లాడుతూ.‘హిందూ వారసత్వ మాసాన్ని ప్రకటించడం వల్ల హిందూ – కెనడియన్‌ల గురించి ప్రస్తుత, భవిష్యత్ తరాలు గుర్తుచేసుకోవడానికి, అవగాహన కల్పించడానికి, సమాజంలో వారు పోషించిన పాత్ర గురించి తెలియజేయడానికి వీలు కలుగుతుందన్నారు.హిందువులు వందేళ్ల క్రితం కెనడాకు వలస రావడం ప్రారంభించారని.
ప్రస్తుతం ఇక్కడ వారి జనాభా 6,00,000 వరకు వుంటుందని చంద్ర ఆర్య పేర్కొన్నారు.వీరు భారత్, శ్రీలంక, నేపాల్, గయానా, ట్రినిడాడ్, టొబాగోతో సహా ఇతర దక్షిణాసియా, ఆగ్నేయాసియా, ఆఫ్రికా, కరేబియన్ దేశాలకు చెందినవారని ఆయన చెప్పారు
.