రేపు జరగనున్న కెనడా ఫెడరల్ ఎన్నికలు అక్కడి అన్ని పార్టీలకు చావోరేవో అన్నట్లుగా తయారైయ్యాయి.అధికారాన్ని అందుకోవాలని జస్టిన్ ట్రూడో నేతృత్వంలోని లిబరల్ పార్టీ.
ఇప్పటికే రెండు సార్లు ఓడిపోయి తీవ్ర ఇబ్బందుల్లో వున్న కన్జర్వేటివ్స్ విజయమే లక్ష్యంగా హోరాహోరిగా పోరాడుతున్నారు.రెండు పెద్ద పార్టీల మధ్యలో కింగ్ మేకర్‌గా అవతరించాలని భారత సంతతికి చెందిన జగ్మీత్ సింగ్ సారథ్యంలోని న్యూడెమొక్రాటిక్ పార్టీ (ఎన్‌డీపీ) సర్వశక్తులూ ఒడ్డుతోంది.
ఈ నేపథ్యంలో పోలింగకు రెండు రోజుల ముందు ప్రధాని జస్టిన్ ట్రూడోకు ‘‘ఓట్ల చీలిక ’’ భయం పట్టుకుంది.ప్రత్యర్ధికి విజయాన్ని అందించగల ఈ విషయంలో అప్రమత్తంగా వుండాలని ఆయన తన మద్ధతుదారులకు సూచించారు.
ప్రధానంగా వామపక్ష భావజాలం మెండుగా వున్న న్యూడెమొక్రాటిక్ పార్టీ (ఎన్‌డీపీ), పాపులిస్ట్ పీపుల్స్ పార్టీ ఆఫ్ కెనడా (పీపీసీ)లు ఎక్కడ ఓట్లు చీల్చుతాయోనని ట్రూడో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
జర్నల్ టి మాంట్రియల్, నేషనల్ పోస్ట్ వార్తాపత్రికలునిర్వహించిన తాజా సర్వే ప్రకారం.
లిబరల్స్ కంటే కన్జర్వేటివ్స్ ఒక శాతం పైన వున్నారని తేలింది.లిబరల్స్ 32 శాతం ఓట్లు సంపాదిస్తారని.
కన్జర్వేటివక్స్ 32 శాతం ఓట్లు పొందుతారని సర్వే తేల్చింది.ఇక ఎన్డీపీకి 19 శాతం, పీపీసీకి 6 శాతం ఓట్లు లభిస్తాయని తెలిపింది.
49 ఏళ్ల ట్రూడో కోవిడ్‌ను సమర్ధవంతంగా ఎదుర్కొన్నానన్న నమ్మకంతో ముందస్తు ఎన్నికలకు పిలుపునిచ్చారు.ఈసారి మైనారిటీతో కాకుండా మెజారిటీ ప్రభుత్వాన్ని నడిపించాలని ఆయన భావిస్తున్నారు.
కానీ ట్రూడోకు అది అంత సులభం కాదని ఇప్పుడిప్పుడే అర్ధమవుతోంది.ట్రూడో తన ప్రచారంలో చివరి మూడు రోజుల్లో రెండు రోజులు అంటారియోలో గడిపారు.
అయితే ఇక్కడ సర్వేల్లో మాత్రం ఎన్డీపీకి ఎక్కువ స్కోప్ వున్నట్లు తేల్చాయి.

శనివారం విడుదలైన మరో సర్వే ప్రకారం.338 సీట్లున్న హౌస్ ఆఫ్ కామన్స్‌లో మెజారిటీకి అవసరమైన 170 స్థానాలను ఏ పార్టీ కూడా చేరుకోలేదని తెలిపింది.అయితే కన్జర్వేటివ్స్‌కు 30.6 శాతం ఓట్లు, లిబరల్స్‌కు 27.7 శాతం ఓట్లు లభిస్తాయని అంచనా వేసింది.టీకాలకు వ్యతిరేకంగా నిరసనలు తెలియజేస్తూ ఊహించని ప్రజామద్ధతు పొందిన పీపీసీ కన్జర్వేటివ్‌లకు పడాల్సిన ఓట్లను చీల్చి.తద్వారా లిబరల్స్ విజయానికి దోహదం చేస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

తాజాగా వెలువడుతున్న సర్వేల ప్రకారం… జగ్మీత్ సింగ్ నేతృత్వంలోని న్యూ డెమొక్రాటిక్ పార్టీ మరోసారి కింగ్ మేకర్ అయ్యే అవకాశం వుందని తెలుస్తోంది.తాజా పరిణామాలు లిబరల్స్, కన్జర్వేటివ్స్ మధ్య హోరాహోరి పోరు సూచిస్తున్నందున.రెండు ప్రధాన పార్టీలు మెజారిటీ పొందలేకపోతే చిన్న పార్టీల మద్ధతు అవసరం. 2019లో జస్టిన్ ట్రూడో లిబరల్ పార్టీకీ 157 సీట్లు వచ్చాయి.338 మంది సభ్యులున్న హౌస్ ఆఫ్ కామన్స్‌లో అధికారాన్ని అందుకోవడానికి ట్రూడోకి 13 మంది సభ్యుల మద్ధతు కావాలి.అటు కన్జర్వేటివ్స్‌కు 121 సీట్లు వచ్చాయి.
జగ్మీత్ సారథ్యంలోని ఎన్‌డీపీ 24 స్థానాలు గెలుచుకుంది.దీంతో జగ్మీత్ మద్ధతుతో ట్రూడో మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు.