డొనాల్డ్ ట్రంప్ యూఎస్ స్పీకర్ కానున్నారా..? అమెరికా రాజ్యాంగం ఏం చెబుతోంది..?

యూఎస్ ప్రతినిధుల సభ స్పీకర్ కెవిన్ మెక్‌కార్తీని( Kevin McCarthy ) అవిశ్వాస తీర్మానం ద్వారా తొలగించిన నేపథ్యంలో అమెరికా రాజకీయాలు హాట్ హాట్‌గా మారాయి.అధ్యక్ష ఎన్నికలకు ముందు ఈ పరిణామం తీవ్ర ప్రభావం చూపే అవకాశం కూడా కనిపిస్తోంది.

 Can Donald Trump Become Next Us Speaker What Does Us Constitution Say Details, D-TeluguStop.com

ఈ నేపథ్యంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్( Donald Trump ) సంచలన ప్రకటన చేశారు.హౌస్ స్పీకర్ పదవికి పోటీ చేయడానికి తాను సిద్ధంగా వున్నానని తెలిపారు.

దేశానికి, రిపబ్లికన్ పార్టీకి ఏది ఉత్తమమో అది చేస్తామని ట్రంప్ పేర్కొన్నారు.కానీ తన దృష్టి పూర్తిగా అధ్యక్ష ఎన్నికలపైనే వుందని ఆయన వెల్లడించారు.

ఫాక్స్ న్యూస్ కథనం ప్రకారం.టెక్సాస్ ప్రతినిధి ట్రాయ్ నెహ్ల్స్( Troy Nehls ) ఒక ప్రకటనలో ఇలా అన్నారు.డొనాల్డ్ ట్రంప్ పేరును యూఎస్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ స్పీకర్ ఎన్నికల్లో ప్రకటిస్తారని చెప్పారు.యూఎస్ రాజ్యాంగం( US Constitution ) ప్రకారం మెక్ కార్దీ పదవిని భర్తీ చేయడానికి ట్రంప్‌కు అర్హత వుంది.

ఎందుకంటే స్పీకర్.సభలో సభ్యునిగా వుండాలనే నిబంధనేం లేదు.

కానీ తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు ఏ సభా నాయకత్వాన్ని చేపట్టలేరని రిపబ్లికన్ పార్టీ నిబంధనలు చెబుతున్నాయి.ప్రస్తుతం ట్రంప్‌పై పలు అభియోగాలు వున్నందున ఆయన ఏ పదవిని చేపట్టడకుండా ఈ రూల్స్ అడ్డుకుంటున్నాయి.

Telugu Democrats, Donald Trump, Joe Biden, Kevin Mccarthy, Republican, Troy Nehl

నేరారోపణలు, 91 వేర్వేరు కౌంట్ల కింద అభియోగాలను ఎదుర్కొంటున్నందున తనను పలువురు దీని గురించి అడిగారని ట్రంప్ మీడియా ప్రతినిధులతో అన్నారు.కానీ రిపబ్లికన్ పార్టీలో( Republican Party ) కొందరు గొప్ప వ్యక్తులన్నారని.వారు స్పీకర్‌గా బాధ్యతలు చేపడతారని వ్యాఖ్యానించారు.ఇదే సమయంలో అమెరికా అధ్యక్ష ఎన్నికలపైనే తాను ప్రధానంగా దృష్టి పెట్టినట్లు ట్రంప్ స్పష్టం చేశారు.అయినప్పటికీ పదవిని కోల్పోయిన కెవిన్ మెక్‌కార్థీకి ప్రత్యామ్నాయం గురించి చర్చించే విషయంలో హౌస్ రిపబ్లికన్‌లు .ట్రంప్ పేరును కూడా ప్రస్తావిస్తున్నారు.

Telugu Democrats, Donald Trump, Joe Biden, Kevin Mccarthy, Republican, Troy Nehl

అమెరికా రాజకీయ చరిత్రలోని 234 ఏళ్లలో హౌస్ స్పీకర్‌గా( House Speaker ) పనిచేసిన 55 మందిలో ప్రతి ఒక్కరూ ఎన్నికైన ప్రతినిధే.అయితే హౌస్ స్పీకర్ కావడానికి ట్రంప్ 218 ఓట్లను అలవోకగా సంపాదించి ఆ పదవిని గెలుచుకుంటారని అంచనా వేయబడింది.అతనికి డెమొక్రాట్ల నుంచి ఏ ఒక్కరూ మద్ధతు ఇచ్చే అవకాశం లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube