తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చిందని తెలుస్తోంది.పార్టీ హైకమాండ్ పిలుపు మేరకు ఈనెల 24న కాంగ్రెస్ ముఖ్యనేతలు హస్తినకు పయనం కానున్నారు.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఎన్నికల వ్యూహాన్ని ఏఐసీసీ ఖరారు చేయనుందని సమాచారం.కాగా తెలంగాణ ముఖ్యనేతలతో నిర్వహించే ఈ సమావేశం ప్రియాంక గాంధీ నేతృత్వంలో జరగనుంది.
కర్ణాటకలో విజయం సాధించిన కాంగ్రెస్ తెలంగాణలోనూ అధికారంలోకి రావాలనే దిశగా పావులు కదుపుతూ ప్రణాళికలు రచిస్తోంది.