గండిపేటలో ఖరీదైన ప్రాపర్టీ కొనుగోలు చేసిన బన్నీ.. ఎన్ని కోట్లో తెలుసా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో అల్లు ఫ్యామిలీ నుంచి హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు నటుడు అల్లు అర్జున్.ఇన్ని రోజులు స్టైల్ స్టార్ గా ఇండస్ట్రీలో కొనసాగుతున్నటువంటి ఈయన సౌత్ ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.

 Bunny Who Bought An Expensive Property In Gandipet Do You Know How Many Crores B-TeluguStop.com

ఇక అల్లు అర్జున్ ఎప్పుడైతే క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమాలో నటించారో అప్పటినుంచి ఈయన పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిపోయారు.ఇక ఈ సినిమాతో స్టైలిష్ స్టార్ కాస్త ఐకాన్ స్టార్ గా మారిపోయి సౌత్ టు నార్త్ ఎంతో మంచి ఆదరణ పొందారు.

ఇక ఈ సినిమాతో అల్లు అర్జున్ కు కేవలం ప్రేక్షకులు మాత్రమే కాకుండా సెలబ్రిటీలు కూడా అభిమానులుగా మారిపోయారు.పుష్ప సినిమా పాన్ ఇండియా స్థాయిలో మంచి విజయం అందుకోవడంతో ఈయనకు ఎంతో క్రేజ్ పెరగడమే కాకుండా ఎన్నో అవకాశాలు కూడా వస్తున్నట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందిన అల్లు అర్జున్ కోసం పలు కంపెనీలో తమ బ్రాండ్లను ప్రమోట్ చేయడం కోసం అల్లు అర్జున్ చుట్టు ప్రదక్షిణాలు చేస్తున్నారు.

Telugu Allu Arajun, Allu Sirish, Allu Studios, Bunny, Hyderabad, Gandipet, Pushp

ఇలా సినిమాల పరంగా యాడ్స్ ద్వారా అల్లు అర్జున్ భారీగానే సంపాదిస్తున్నారని చెప్పాలి.ఇప్పటికే అల్లు అర్జున్ హైదరాబాదులో పాటు ఇతర నగరాలలో కూడా ఖరీదైన ఆస్తులను కొనుగోలు చేశారు.హైదరాబాదులో 100 కోట్ల రూపాయల నిర్మాణంతో అందమైన ఇంటిని కొనుగోలు చేసిన విషయం మనకు తెలిసిందే త్వరలోనే ఈ ఇల్లు కూడా ప్రారంభం కాబోతోంది.

అదేవిధంగా గండిపేట ఏరియాలో పది ఎకరాల విస్తీర్ణంలో అల్లు స్టూడియోస్ నిర్మించారు.ఈ స్టూడియోస్ కూడా అక్టోబర్ ఒకటవ తేదీ ప్రారంభం కానుంది.ఇదిలా ఉండగా తాజాగా అల్లు అర్జున్ కి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.అల్లు స్టూడియోస్ పరిసర ప్రాంతంలోనే ఈయన మరొక ఖరీదైన ప్రాపర్టీ కొనుగోలు చేశారని సమాచారం.

ఈ ప్రాపర్టీ కోసం అల్లు అర్జున్ 50 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని వార్తలు వస్తున్నాయి అయితే త్వరలోనే ఈ విషయం గురించి అధికారికంగా వెల్లడించనున్నట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube