సార్ వస్తారు, సెట్ చేస్తారు!

పోతన భాగవతంలోని గజేంద్రమోక్షం ఘట్టంలో మొసలి నోట చిక్కిన గజరాజును రక్షించడానికి సాక్షాత్తు శ్రీమహావిష్ణువు కిందకి దిగివచ్చిన కథ అందరికీ తెలిసిందే .ఇప్పుడు టికెట్ పై ఆశపెట్టుకొని నిరాశ చెందిన చాలామంది నేతలు వేయికళ్లతో బారాస వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు( Kalvakuntla Taraka Rama Rao ) గురించి ఎదురుచూస్తున్నారట.

 Brs Leaders Waiting For Ktr To Come , Ktr, Brs Leaders, Kalvakuntla Taraka Rama-TeluguStop.com
Telugu Brs, Brs Ktr, Pragatibhavan-Telugu Political News

బారాశాలో టికెట్ల కేటాయింపుకు కొద్ది రోజులు ముందే ఆయన విదేశాలకు పయనమయ్యారు.వ్యక్తిగత ప్రయాణ అని చెప్పినప్పటికీ టికెట్లు కేటాయింపుల లో అసంతృప్తుల టెన్షన్ తప్పించుకోవడానికే ఆయన అమెరికా ప్రయాణం పెట్టుకున్నారంటూ వార్తలు వినిపించాయి.అభ్యర్థుల లిస్టు ప్రకటించే రోజులు గడుస్తున్నా ఆయన ఇంకా నగరానికి తిరిగి రాలేదు.అయితే చాలా చోట్ల అసంతృప్తి తో ఉన్న అభ్యర్థులు, రెబల్ అభ్యర్థుల నుంచి అనేక అసంతృప్తులు అధిష్టానానికి చుట్టుకున్నాయి.

అంతేకాకుండా టికెట్లు కేటాయించిన నియోజకవర్గాల్లో కూడా ద్వితీయ శ్రేణి నాయకులు సిటింగులకు సహకరించని వాతావరణం కొన్ని నియోజకవర్గాల్లో కనిపిస్తుంది.

Telugu Brs, Brs Ktr, Pragatibhavan-Telugu Political News

ఇలాంటి వారందరికీ ఇప్పుడు జిందా తెలి స్మాత్ లాగా కేటీఆర్ రాగానే అన్న సమాధానం ప్రగతిభవన్( Pragatibhavan ) నుంచి వినిపిస్తుందట .చిన్న సార్ రాగానే అన్ని సెట్ అవుతాయని, ఆయన వచ్చిన తర్వాత మాట్లాడదాం అంటూ ప్రగతి భవన్ నుంచి వారికి సమాధానం వినిపిస్తుందట.దాంతో సార్ ఎప్పుడు వస్తారు? అంటూ ఎంక్వైరీ చేసే వాళ్ళ లిస్టు పెరిగిపోతున్నట్లుగా తెలుస్తుంది .రామగుండం, పటాన్చెరువు, కల్వకుర్తి, కోదాడ వంటి నియోజకవర్గాలలో కొన్నిచోట్ల రెబల్ అభ్యర్థులు టికెట్ కోసం అధిష్టానం పై ఒత్తిడి పెంచుతుంటే మరికొన్నిచోట్ల సిట్టింగ్ అభ్యర్థిని మార్చమంటూ ద్వితీయ , తృతీయ శ్రేణి అభ్యర్థులు అధిష్టానాన్ని కోరుతున్నారు.దాంతో కేటీఆర్ రాగానే వరుస సమావేశాలు నిర్వహించి పూర్తిస్థాయి సమాచారాన్ని తెప్పించుకొని కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా అధికార పార్టీ ఉన్నట్లుగా తెలుస్తుంది.

మరి సార్ ఎప్పుడు వస్తారో సమస్యలు ఎప్పుడు తీరుస్తారో

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube