బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు.తెలంగాణలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం ఏడు సీట్లకే పరిమితం అవుతుందని బండి సంజయ్ తెలిపారు.
ఎంఐఎం ఓట్లను చీల్చి కాంగ్రెస్ పార్టీకి సపోర్టు చేయాలని బీఆర్ఎస్ చూస్తోందని బండి సంజయ్ ఆరోపించారు.గ్రామ పంచాయతీలకు నిధులు నేరుగా ఇస్తే అడ్డుకున్నది ఎవరని ప్రశ్నించారు.
అదేవిధంగా కేంద్రం ఇచ్చే నిధులను దారి మళ్లిస్తున్నది ఎవరని నిలదీశారు.రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.
ఈ క్రమంలో రానున్న ఎన్నికల్లో బీజేపీనే అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.