ఇపుడు ప్రపంచమంతటా శరవేగంగా దూసుకుపోతున్న రంగాలలో రోబోటిక్స్ ఒకటి.అవును, చాలా చోట్ల వీటిని మనుషులకు ప్రత్యామ్నాయాలుగా వాడుతున్నారు.
ఇక మీలో చాలామందికి అసలు రోబోటిక్స్ అంటే ఏమిటి అనే సందేహం వుంటుంది.రోబాట్‌లకు,( Robots ) వాటి నమూనాలు, తయారీ, అనువర్తనం, నిర్మాణ స్థాపత్యాలకి సంబంధించిన సాంకేతిక శాస్త్రాన్ని రోబాటిక్స్ అంటారు.
రోబాటిక్స్ అనేది ఎలక్ట్రానిక్స్, యంత్రాలు, వగైరా అంశాలతో మిళితమై వుంటుంది.కాగా రోబాట్ అనే పదాన్ని చెకొస్లొవేకియా రచయిత కారెల్ కాపెక్ ప్రజలకు పరిచయం చేసేడు.
అతను వాడిన ఈ పదం రస్సుమ్స్ యూనివర్సల్ రోబాట్స్ అనే నాటకంలో 1920లో ప్రదర్శించబడింది.స్లావిక్ భాషలలో “రబోతా” అంటే పని.కనుక పని చేసే పనిముట్టుకి రోబాట్ అనే పేరు పెట్టేడు ఆయన.

అక్కడినుండి “రోబాటిక్స్”( Robotics ) అనే పదం వాడుకభాషలోకి వచ్చింది.మొదట దీనికోసం కొలిమిలో కాలుతున్న లోహ భాగాలను తీసేందుకు, వాటిని క్రమపద్ధతిలో అమర్చేందుకు ఉపయోగించారు.అంటే మరీ ముఖ్యంగా మానవులు చేసేందుకు సాధ్యం కాని పనులలో… అనగా, బాగా అపరిశుభ్రమైన, ప్రమాదకరమైన పనులు చేసేందుకు వీటిని వాడడానికి యత్నిస్తున్నారు.
అలా ఇపుడు చాలా రంగాల్లో విస్తృతంగా వాడుతున్నారు.ఉత్పాదక, ప్యాకింగ్, నిర్మాణ, రవాణా, భూమి, అంతరిక్ష అన్వేషణ, శస్త్ర చికిత్స, ఆయుధ తయారీ, ప్రయోగశాల పరిశోధనలు, వినియోగదారుల, పారిశ్రామిక ఉత్పత్తులను భారీస్థాయిలో తయారు చేసే కార్యకలాపాలకు కూడా రోబాట్‌లను వాడుకుంటున్నారు.
ఇక దీనికోసం ప్రతి ఏటా పెద్దమొత్తంలో ఖర్చు చేస్తున్నాయి ఆయా ప్రభుత్వ సంస్థలు.

ఇక అసలు విషయంలోకి వెళితే, ఈ నేపధ్యంలోనే బ్రిటన్ లోని( Britain ) వెస్ట్ ససెక్స్ కాట్టెసూర్ స్కూల్( West Sussex Cottesmore School ) హెడ్మాస్టర్ టామ్ రోజర్సన్ తనకు సహాయంగా ప్రిన్సిపాల్ గా, హెడ్ టీచర్ గా బెయిలీ( Bailey ) అనే AI రోబోను నియమించుకున్నారట.ఇదే విషయం ఇపుడు అంతర్జాతీయంగా హాట్ టాపిక్ అయింది.స్కూల్ నిర్వహణ, పాలసీల వంటి అనేక విషయాల్లో తనకు మెరుగైన సలహాలు ఇచ్చేందుకు వీలుగా ఈ రోబోను నియమించినట్లు హెడ్మాస్టర్ తాజాగా ఓ మీడియా వేదికగా తెలిపారు.
దాంతో ఈ విషయం వైరల్ అవుతోంది.