2001 సెప్టెంబరు 11న అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ పైన బిన్ లాడెన్ నేతృత్వంలోని అల్‌ఖైదా ఉగ్రవాదులు జరిపిన దాడుల్ని చరిత్ర మరవలేదు.అత్యంత శక్తివంతమైన అమెరికాపై ఉగ్రదాడితో ప్రపంచ దేశాలన్నీ ఉలిక్కిపడ్డాయి.
సెప్టెంబరు 11 దాడుల్లో 3000 మంది బాధితులు, 19 మంది హైజాకర్లు మరణించారు.న్యూయార్క్ ప్రభుత్వారోగ్య శాఖ నివేదిక ప్రకారం, జూన్ 2019 నాటికి అగ్నిమాపక దళ సిబ్బంది మరియు పోలీసులు సహా రక్షణ చర్యల్లో పాల్గొన్న 836 మంది మరణించారు.
రెండు భవనాల్లో దుర్మరణం పాలైన మొత్తం బాధితుల్లో 343 మంది అగ్నిమాపక దళ సిబ్బంది, 60 మంది న్యూయార్క్ నగరం, పోర్ట్ అథారిటీలకు చెందిన పోలీసు అధికారులు ఉన్నారు.ఇంకా పెంటగాన్ భవనంపై జరిగిన దాడుల్లో 184 మంది దుర్మరణం చెందారు.
మరణించిన వారిలో అత్యధికులు సాధారణ పౌరులే.వారిలో 70కి పైగా ఇతర దేశాలకూ చెందిన వారున్నారు.
దీంతో బిన్‌లాడెన్, అల్‌ఖైదాలపై పగబట్టిన అమెరికా.ఆఫ్ఘన్ గడ్డపై దిగి భీకర దాడులు చేసింది.
పదేళ్ల పాటు నింగీ, నేల, పాతాళంలో గాలించి పాక్‌లోని అబోట్టాబాద్‌లో లాడెన్‌ను హతమార్చింది.
మానవ జాతి ఉలిక్కిపడిన ఈ రోజున పుట్టాడు భారత సంతతికి చెందిన ఓ యువకుడు.
అతని పేరు అనీష్ శ్రీవాస్తవ.ఆ రోజున ఈ బాలుడి మామ వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లో పనికి సెలవు పెట్టి.అనీష్ పుట్టడంతో సంబరాలు చేసుకోవడంతో ప్రాణాలతో బయటపడ్డాడు.సెప్టెంబర్ 11, 2001లో వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై దాడి జరిగిన రోజున అమెరికా వ్యాప్తంగా జన్మించిన 13,000 మంది పిల్లల్లో శ్రీవాస్తవ ఒకరు.
శ్రీవాస్తవ.ఆ రోజు ఉదయం 10.05 గంటలకు న్యూయార్క్ సమీపాన వున్న న్యూజెర్సీ ప్రిన్స్‌టన్ ఆసుపత్రిలో జన్మించాడు.సరిగ్గా అనీష్ పుట్టడానికి ఆరు నిమిషాల ముందు సౌత్ టవర్ పడిపోగా.
తర్వాతి గంటకే నార్త్ టవర్ కుప్పకూలింది.ఇటు హాస్పిటల్ వెయిటింగ్ రూమ్‌లో అతని తండ్రి ఆశిష్, సోదరుడు మనీష్ టెలివిజన్‌కు అతుక్కుపోయారు.
ముఖ్యంగా శ్రీవాస్తవ మామ.తన కార్యాలయం వున్న ట్విన్ టవర్స్ కుప్పకూలడం, బూడిదగా మారడాన్ని చూస్తూ వణికిపోతున్నాడు.

ఆయన ఆరోజున తన మేనల్లుడిని ఈ ప్రపంచంలోకి ఆహ్వానించేందుకు గాను ఉదయం సెలవు పెట్టాలని చివరి నిమిషంలో నిర్ణయం తీసుకున్నాడు.ఆయన కనుక ఆ క్షణంలో సెలవు పెట్టకుండా వుండి వుంటే మరణించిన 3000 మందిలో తానూ వుండేవాడినని చెబుతూ వుంటాడు.అందుకే శ్రీవాస్తవ అంటే ఆయనకు ప్రత్యేకమైన అభిమానం.