టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్( Allu Arjun ) హీరోగా నటించిన సినిమా అలా వైకుంఠపురంలో.ఇందులో పూజ హెగ్డే హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.
ఈ సినిమా విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో పాటు కలెక్షన్ల వర్షం కురిపించింది.ఈ మూవీకి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.
కాగా ఈ సినిమాను అల్లు అరవింద్ హిందీలో షెహజాదా పేరు తో రీమేక్ చేయగా అందులో బాలీవుడ్ యంగ్ స్టార్ కార్తీక్ ఆర్యన్ నటించాడు.టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఈ మూవీ బాలీవుడ్ లో ప్లాప్ గా నిలిచింది.
కలెక్షన్లు కూడా పెద్దగా రాలేదు.

షెహజాదా రిలీజ్ అయ్యేసరికే అలా వైకుంఠపురంలో( Ala Vaikunthapurramuloo ) హిందీ డబ్బింగ్ వెర్షన్‌ను చాలామంది చూసేశారు.ఇలా ఇంకా చాలా కారణాలతో ఈ మూవీ బాలీవుడ్ లో ప్లాప్ అయ్యింది.కార్తీక్ ఆర్యన్( Karthik Aryan ) కెరీర్‌లో ఈ మూవీ అతి పెద్ద డిజస్టర్‌గా నిలిచిపోయింది.
ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా ప్లాప్ అవ్వడంపై స్పందించారు యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్.ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.ఇకపై ఎప్పుడూ రీమేక్స్ జోలికి వెళ్లను.ఈ మూవీ నాకు ఒక అనుభవాన్ని ఇచ్చింది.
భవిష్యత్తులో ఇక ఎప్పుడూ రీమేక్స్ చేకూడదు.నేను కూడా ఇక రీమేక్‌లు చేయను.
రీమేక్ మూవీ చేయడం ఇదే తొలిసారి, ఇదే చివరి సారి కూడా.

మూవీ షూటింట్ సమయంలో ఆ ఫీల్ కలగలేదు.మూవీ ఫ్లాప్ తర్వాత అసలు విషయాన్ని అర్థం చేసుకున్నాను.ప్రజలు ఇప్పటికే ఆ మూవీని చూసేశారని, మళ్లీ వారు డబ్బులు ఖర్చు చేసి అదే సినిమా చూడటానికి థియేటర్లకు ఎందుకు వెళ్తారని అర్థం చేసుకున్నాను.
అదే నా కళ్లు తెరిపించింది అని చెప్పుకొచ్చాడు కార్తీక్ ఆర్యాన్.కాగా షెహజాదా సినిమా( Shehzada ) కార్తీక్ కు ఫ్లాప్ సినిమాను తెచ్చి పెట్టడంతో పాటు అల్లు అరవింద్ కి కూడా తీవ్ర నష్టాలను మిగిల్చింది.
ఇది ఇలా ఉంటే కార్తీక్ ఆర్యాన్ నటించిన సత్య ప్రేమ్ సినిమా అల్లు అరవింద్ కి కూడా భారీగా నష్టాలను తెచ్చి పెట్టింది.