బీజేపీ ఆపరేషన్ 'సృజన' ! అసలు లక్ష్యం ఇదేనా ?

తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు కోటరీ నాయకులుగా పేరుపడ్డ సుజనా చౌదరి, సీఎం రమేష్ తదితర రాజ్యసభ సభ్యులను పార్టీలో చేర్చుకున్న బీజేపీ తెలుగుదేశం పారుతీకి గట్టి షాకే ఇచ్చింది.అంతే కాదు ఇప్పుడు చేర్చుకున్న ఆ నాయకుల ద్వారానే టీడీపీని బలహీనం చేసే పనిలో నిమగ్నం అయ్యింది బీజేపీ.

 Bjp Operation In Sujana Chowdary-TeluguStop.com

ఆ బాధ్యతను కూడా ఇప్పుడు బాబు కోటరీ నాయకుడిగా పేరుపడ్డ సుజనా చౌదరి చేతుల్లో పెట్టింది.టీడీపీలో ఉండగా సుజనా చౌదరి కంపెనీ లకు సంబంధించి అవకతవకలపై తరచూ ఐటీ దాడులు, సీబీఐ ఎంక్వరీ లు ఇలా చాలా ఇబ్బందులే ఎదుర్కొన్నారు.

ఇప్పుడు బీజేపీ లో మంచి ప్రయార్టీతోనే ఉన్నారు.ఈ నేపథ్యంలో ఆయనకు ఏపీలో టీడీపీ కీలక నాయకులను చేర్పించే బాధ్యతను సుజనకు అప్పగించింది.

-Telugu Political News

ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గం నాయకులు ఏ పదవుల్లో ఉన్నా వారిని తీసుకువస్తే సుజనా చౌదరికి భవిష్యత్తులో మంచి పదవులే దక్కే అవకాశం కూడా ఉన్నట్టు బీజేపీ సంకేతాలు ఇచ్చింది.దీంతో సుజనా చౌదరి ఢిల్లీలో ఉంటూనే ఏపీలో ఆపరేషన్ కమలం స్టార్ట్ చేసినట్లు చెబుతున్నారు.తనకు పట్టున్న ప్రాంతాల్లో టీడీపీ నాయకులకు సుజనా చౌదరి తరచూ ఫోన్ లు చేస్తూ బీజేపీలోకి రావాల్సిందిగా ఆహ్వానాలు ఇస్తున్నారు.అంతే కాదు పార్టీలో చేరితే మీకు ఫలానా ఫలానా ప్రయోజనాలు ఉన్నాయంటూ ఆఫర్లు ఇస్తున్నారు.

అంతకు ముందు టీడీపీలో సుజనా చౌదరి కీలకంగా వ్యవహరించేవారు.ఇటీవల జరిగిన ఎన్నికలను మినహాయించి గతంలో జరిగిన రెండు, మూడు ఎన్నికల్లో సుజనా కీలక పాత్ర కూడా పోషించారు.

టికెట్ల కేటాయింపులో కూడా తన హవా చూపించారు.

ప్రస్తుతం ఆయన బీజేపీని ఏపీలో బలోపేతం చేయడంలో నిమగ్నం అయ్యాడు.

పార్టీ బాగా పుంజుకుంటే భవిష్యత్తులో ఆ పార్టీ ద్వారా తాను సీఎం అయ్యే అవకాశాలు కూడా ఉండే ఛాన్స్ ఉందని సృజన గట్టిగా నమ్ముతున్నారు.అందుకే ఇప్పుడు కమ్మ సామజిక వర్గం ఎక్కువగా ఉన్నగుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లా నాయకులపై ఎక్కువగా దృష్టి పెడుతున్నారు.

ఈ జిల్లాల్లో ఎక్కువగా కమ్మ సామాజికవర్గం నాయకులు టీడీపీలో ఉన్నారు.వీరంతా ఆర్థికంగా బలమైన వారే.వివిధ వ్యాపారాలు ఉండటంతో వీరిని బీజేపీ వైపునకు రప్పించేందుకు సుజనా చౌదరి కసరత్తు చేస్తున్నారు.ఈ జిల్లాల నుంచి ఇప్పటికే ఐదారుగురు కీలక నేతలు బీజేపీలో జంప్ చేసేందుకు రెడీ అయ్యారని సమాచారం.

ఆషాఢం తరువాత వీరంతా బీజేపీలోకి క్యూ కట్టే ఛాన్స్ ఉందని సుజనా సన్నిహితులు చెప్పుకొస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube