తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.రేవంత్ రెడ్డిని కొత్త బిచ్చగాడితో పోలుస్తూ మండిపడ్డారు.
రేవంత్ రెడ్డి వచ్చినా బీజేపీలో చేర్చుకోవడం కష్టమేనని రాజగోపాల్ రెడ్డి తెలిపారు.క్లీన్ ఇమేజ్ ఉన్న వాళ్లనే బీజేపీ చేర్చుకుంటుందన్నారు.
రేవంత్ రెడ్డి తమ లాంటి వాళ్లను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం హాస్యాస్పదంగా ఉందని పేర్కొన్నారు.రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో వలసవాదని స్పష్టం చేశారు.
కేసీఆర్ కుటుంబం నుంచి ఇద్దరు ముగ్గురు జైలుకు వెళ్లడం ఖాయమని చెప్పారు.కొత్తగా చేరిన వారికి అవకాశాలు ఇస్తే బీజేపీ మరింత బలోపేతం అవుతుందని వెల్లడించారు.
ఓ లక్ష్యం కోసం బీజేపీలో చేరామన్న రాజగోపాల్ రెడ్డి పార్టీని వీడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.