దేశంలో విపక్షాల ఐక్యత కోసం బీహార్ సీఎం నితీశ్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.ఇందులో భాగంగానే ఆయన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తో సమావేశం అయ్యారు.
విపక్షాల ఐక్యత, ఢిల్లీలో పాలన అధికారులపై కేంద్రం ఆర్డినెన్స్ మరియు సుప్రీంకోర్టు తీర్పుపై చర్చిస్తున్నారని తెలుస్తోంది.కేంద్రం ఆర్డినెన్స్ ను బిల్లుగా తీసుకు వస్తే బీజేపీయేతర పార్టీలన్నీ రాజ్యసభలో బిల్లును ఓడించవచ్చని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ చెప్పారు.2024లో బీజేపీ ప్రభుత్వం పోతుందనే సందేశం పంపవచ్చన్నారు.ఈ క్రమంలో కేజ్రీవాల్ కు అండగా ఉంటామని బీహార్ సీఎం నితీశ్ కుమార్ హామీ ఇచ్చారు.
ఈ నేపథ్యంలోనే విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు.